భగభగ మండే ఎండలు..చలివేంద్రం ఏర్పాటులో నిర్లక్ష్యం
1 min read– చలివేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్న మండల ప్రజలు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: భగభగ మండే ఎండలు బయటికి రావాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మిడుతూరు మండలంలో గత రెండు నెలల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండలు విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే.కానీ పనుల నిమిత్తం మండల కార్యాలయాలకు ప్రజలు రావాలంటే ఎండ వేడిమికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. మండలంలో మొత్తం 19 గ్రామ పంచాయతీలు(4 మజార గ్రామాలతో కలిపితే)24 గ్రామాలు ఉన్నాయి.ఇది చాలా పెద్ద మండలం ఈ గ్రామాల ప్రజలు ప్రతిరోజూ కూడా మండల కేంద్రంలో ఉండే కార్యాలయాలకు పనుల నిమిత్తం ప్రజలు మండల కేంద్రానికి వస్తూ ఉన్నాం కానీ త్రాగడానికి మంచి నీళ్లు చలివేంద్రం లేకపోవడంతో హోటళ్ల దగ్గరికి నీళ్లు తాగడానికి వెళ్తూ ఉన్నామని కానీ హోటల్ యాజమాన్యం వారు ప్రజల పైన కసురుకోవడం జరుగుతూ ఉందని మండల ప్రజలు అంటున్నారు.పాఠశాలలు, కళాశాలలు,వసతి గృహాలు ఉన్న సమయంలో విద్యార్థులు ఈమండల కేంద్రంలో వస్తూ ఉండడం వల్ల విద్యార్థులు మరియు ప్రజలు రాకపోకల వల్ల మండల కేంద్రం కితకితలా డుతూ ఉండేదనివారు అంటున్నారు.మండల కేంద్రంలో అనునిత్యం ప్రతిరోజూ అన్ని శాఖల మండల అధికారులు తిరుగుతూ ఉన్నా కూడా ఎండలు ఎక్కువగా ఉందని వారికి తెలిసినా..మండల కేంద్రంలో చలివేంద్రాన్ని గత రెండు నెలల నుంచి ఏర్పాటు చేయాలనే తలంపు అధికారులకు తట్టలేదేమోనని మమ్మల్ని అడిగే వారెవరు న్నారనే రీతిలో అధికారులు పనిచేస్తున్నారని మండల ప్రజలు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి..?