ఉపాధిలో నిబంధనలకు విరుద్ధంగా పనులు
1 min read-ఎంపిడిఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని దేవనూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు నిబంధనలకు విరుద్ధంగా గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ దండుగుల రామకృష్ణ ఉపాధి కూలీలతో పనులు చేయిస్తూ ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.గత రెండు రోజులుగా గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త చిన్న అయ్యన్న పొలంలో ఉన్న గుండు రాళ్ళను 150 మంది ఉపాధి కూలీలతో ఏరి పించడం పొలంలో రెండు ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ట్రాక్టర్లలో ఈ గుండు రాళ్ళను ఫీల్డ్ అసిస్టెంట్ వేయిస్తూ ఉన్నాడని గ్రామస్తులు అంటున్నారు.అసలు ఉపాధి హామీ పథకంలో పొలంలో గుండు రాళ్ళను ఏర్పించడం వంటిది లేనేలేదని ఇది ప్రభుత్వానికి విరుద్ధంగా ఫీల్డ్ అసిస్టెంట్ విధులు చేపడుతూ ఉపాధి కూలీలతో పనులు చేయిస్తూ ఉన్నాడని అంతేకాదు గ్రామంలో ఏమైనా ఉపాధి పనులు చేయాలంటే ముందుగా ఎస్టిమేషన్ వేసిన తర్వాతనే పనులు చేయించాలనే నిబంధన ఉన్నా ఎస్టిమేషన్ చేయకుండానే నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయించడం ఎంతవరకు సబబని వారు అన్నారు.ఈ పనులు చేయించడంలో టెక్నికల్ అసిస్టెంట్ అలీ ఖాన్ మరియు తదితర సిబ్బందికి తెలిసినా తెరయనట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటంటూ వారు ఉపాధి సిబ్బందిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ పదవికి అర్హుడు కాదంటూ గ్రామస్తులు హైకోర్టులో గత పది నెలల కిందట నుంచి కేసు నడుస్తూనే ఉందని ఈఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించాలని ఎన్నిసార్లు మిడుతూరు ఎంపీడీఓ కు విన్నవించినా ఆయన పట్టించుకోవడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించక పోతే అధికారులపై ఫిర్యాదు చేస్తామని ప్రజలు అంటున్నారు.