PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించండి

1 min read

– ఏపీవో వెంకటరమణ..

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ఉద్యాన పంటలు అధిక రాబడిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయాన్ని వైవిధ్యపరచడానికి మెరుగైన ప్రత్యామ్నాయాన్ని రైతులకు పరిచయం చేయడం. వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్న సవాళ్లను అధిగమించడానికి వ్యవసాయ వైవిధ్యీకరణ ఒక ముఖ్యమైన వ్యూహంగా హార్టికల్చర్ సాగుపై అవగాహన కల్పించాలని జిల్లా ఉద్యాన శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం నాడు మండలంలోని ఉపాధి హామీ  కార్యాలయంలో ఎంపీడీవో మల్లేశ్వరప్ప ఏపీవో వెంకటరమణ హార్టికల్చర్ అసిస్టెంట్లు ఎన్నార్జిఎస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఏపీవో మాట్లాడుతూ మండలంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 175 ఎకరాల టార్గెట్ విధించినట్టు రైతులకు మొక్కల పెంపకం సాగు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని అలాగే ఆసక్తిగల రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని ఐదు ఎకరాల లోపు అర్హత కలిగిన సన్న కారు చిన్న కారు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు మండలంలో ఉద్యాన పంటలు గని మంచాలకట్ట ఎల్కే తండా పరిధిలో ఎక్కువగా సాగు చేస్తున్నట్టు కొబ్బరి చెట్ల పెంపకం పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చిందుకూరు దుర్వేసి గడిగిరేవుల తిరుపాడు కొరట మద్ది గ్రామాలలో కొబ్బరి చెట్ల పెంపకం ప్రత్యేక దృష్టి పెట్టాలని హార్టికల్చర్ అసిస్టెంట్లకు ఆదేశించారు.

About Author