PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవనూరు ఉపాధిలో అంతా గోల్ మాల్

1 min read

– పనులు చేపట్టడంపై ఫీల్డ్ అసిస్టెంట్,టీఏ లకు షోకాజ్ నోటీసులు జారీ ఉపాధి పనికి రానివారికి హాజరు

-ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు 

పల్లెవెలుగు వెబ్​ మిడుతూరు: మండల పరిధిలోని దేవనూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ దండుగుల రామకృష్ణ పై గ్రామస్తులు కారాలు మిరియాలు నూరుతున్నారు.ఫీల్డ్ అసిస్టెంట్ విషయంపై గ్రామంలో రోజు రోజుకు మాటల తూటాలు వేడి పుట్టిస్తున్నాయి.అంతేకాదు ఆయనపై మండల అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి.గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయించడంపై గ్రామస్తులు అదే రోజున ఎంపీడీవో కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ,టెక్నికల్ అసిస్టెంట్ అలీఖాన్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు.రెండు రోజుల్లోగా వారు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు.శుక్రవారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరెడ్డి,ఎస్.నవాజ్ అలీ,పి.పుల్లారెడ్డి మరియు ప్రజలతో కలిసి మిడుతూరు ఎంపీడీవోకు ఫీల్డ్ అసిస్టెంట్ పై ఫిర్యాదు చేశారు.మాగ్రామంలో గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఎంపికే విషయంలో గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి వీరన్న పంచాయతీ తీర్మానం లేకుండానే వార్డు మెంబర్లు బోగస్ సంతకాలతో ఫీల్డ్ అసిస్టెంట్ ను ఎక్కించారు. ఇప్పుడు అతను ఏకంగా పనులకు ముందుగా ఎస్టిమేషన్ చేయకుండానే ఒకచోట చేయించాల్సిన పనులు మరోచోట చేయిస్తూ ఉన్నాడని అంతేకాకుండా అతను పనులకు రానివారికి కూడా హాజరు వేస్తూ ఉన్నారని ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తూ ఉన్నా,మీరు ఎవరికైనా చెప్పుకోండి నన్నేమి ఎవరు ఏమి చేయలేరు అంటూ గ్రామంలో అతను అంటూ ఉన్నా అతనిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ముందర హాట్ హాట్ గా చర్చ సాగింది.ఇతని పైన చర్యలు తీసుకోకపోతే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని గ్రామస్తులు ఎంపీడీఓతో అన్నారు. నంద్యాల జిల్లా ఉపాధి హామీ పథకం డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ తో ఎంపీడీఓ ఫోన్లో మాట్లాడారు.ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామంలో అంత అవినీతి చేస్తూ ఉన్నా కూడా అతనిపైన చర్యలు తీసుకోవడం లేదంటే అధికారులకు అతను ఏమైనా పర్సంటేజీలు ఇస్తున్నారా అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం గ్రామస్తులు ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు.ఈకార్యక్రమంలో ఏపీఓ భూపన జయంతి,ఈసీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author