PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాలంటీర్ల సేవలు చారిత్రాత్మకం..

1 min read

– ప్రజలకు ,ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న వాలంటీర్లు..

– జిల్లా యంత్రాంగానికి చెవులు, కళ్లు వాలంటీర్లు..

– 10,163 సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురష్కారాల కింద రూ. 10 కోట్లు అందజేత …

– జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రజలకు పారదర్శకంగా సేవలందిస్తూ ప్రభుత్వానికి ,ప్రజలకు మధ్య చక్కటి వారధిగా వాలంటీర్లు నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో  నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో 6 గురు సేవామిత్ర, 6 గురు సేవా రత్న, 5 గురుకు సేవా వజ్ర పురస్కారాలు పొందిన వాలంటీర్లకు శాలువా, సర్టిఫికేట్, మెడల్స్ ను జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా  బహుకరించారు.  తొలుత ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్,జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  2023 సంవత్సరానికి గాను ఏలూరు జిల్లాకు చెందిన 10163  మంది వాలంటీర్లకు సేవా వజ్ర 37 మందికి , సేవా రత్న క్రింద 169 మందికి , సేవా మిత్ర 9957  మందికి  సుమారు 10 కోట్ల  రూపాయలను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆయా వాలంటీర్ల ఖాతాలకు ఎన్.టి.ఆర్. జిల్లాలో జరిగిన సభ నుండి బటన్ నొక్కి జమ చేసారు.     ఈ సందర్బంగా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ పేదవానికి కష్టం వస్తే వారి కుటుంబసభ్యుల కన్నా ముందే వాలంటీర్ కు ఫోన్ చేస్తున్నారన్నారు.  పేద కుటుంభాలను  స్వంత  మనుషుల్లా భావిస్తూ అలుపెరగని సేవలు అందిస్తు ఆ కుటుంబాలతో వాలంటీర్లు మమేకమవుతున్నరన్నారు. వారికి కేటాయించిన కుటుంబాలల్లో వాలంటీరులు కుటుంబ సభ్యులుగా కలిసిపోయారన్నారు.  తమ కుటుంబ సభ్యులుగా పోలుస్తూ,వారితో వీడారని బంధం ఏర్పడిందని చెప్పవచ్చునన్నారు. కోవిడ్ సమయంలో ప్రాణ భయాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్లి సేవలను అందించారని, ఫీవర్ సర్వే లో చురుకుగా పాల్గొన్న వారి సేవలు వేల కట్టలేనివని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో , వార్డులలో వారికీ కేటాయించిన కుటుంభాలను స్వంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పధకాన్నీ   అందేలా పని చేసే వాలంటీర్ల సేవలు చారిత్రాత్మకం అని అన్నారు.  జిల్లా యంత్రాంగానికి కళ్లు, చెవులుగా వాలంటీర్లు నిలుస్తున్నారన్నారు.  జిల్లాలో సుమారు 20 లక్షల మంది ప్రజల సమస్యలను ఒకొక్కటిగా తెలుసుకోవడం ఎంతో కష్టమని అయితే ప్రభుత్వానికి కళ్ళు, చెవులు, నోరుగా నిలుస్తూ తమ పరిధిలో కుటుంబాల సమస్యలను సచివాలయాల ద్వారా తమ దృష్టికి తీసుకురావడం జరుగుతున్నదన్నారు.  ఇప్పటికే అంకిత భావంతో పనచేస్తున్న వాలంటీర్లు జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నెంబరును ప్రజలకు చేరువు చెయ్యాలన్నారు.  ఈ రోజు వాలంటీర్లకు పశంసా ప్రత్రాలు అందించడం కేవలం వారిని మరింత ప్రోత్సహించడానికేనన్నారు.  తమ ఫెర్మార్మెన్స్ ఇండికేటర్లను మరింత మెరుగుపరచుకొని సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులు పొందాలన్నారు.  జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి మాట్లాడుతూ  ప్రభుత్వ పధకాలను ప్రజల్లోనికి సమర్ధవంతంగా తీసుకువెళ్ళడం లో వాలంటీర్లపాత్ర అభినందనీయమన్నారు.  జిల్లాలో 10 వేల 163 మంది వాలంటీర్లలో 37 మంది సేవావజ్ర, 169 మంది సేవారత్న, 9957 మంది సేవామిత్ర అవార్డులు పొందారన్నారు.  వీటిని వారి పనితీరు ఆధారంగా ఎంపికచేయడం జరిగిందన్నారు. అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రతి పేదవానికి మంచి చేయాలనే తపనతో  ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువచేయడంలో మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. ఏలూరు 3వ వార్డుకు చెందిన వాలంటీరు సాయి శరణ్య మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా తాను 70 కుటుంబాలకు సేవలు అందిస్తున్నానన్నారు. ఎవరైనా ఆయా కుటుంబాలను ఆధార్ కార్డు నెంబరు చెప్పమంటే మా వాలంటీరును అడిగిచెబుతామని వారు చెప్పే విధంగా విశ్వాసం పొందగలిగానన్నారు.  30 మందికి పెన్షన్లు ప్రతి నెలా అందిస్తున్నానన్నారు.  ఇళ్లులేని 23 కుటుంబాలను గుర్తించి వారికి ఇళ్లు మంజూరు చేయించగలిగామన్నారు.  ఏ ఆధారం లేని 13 కుటుంబాలకు  చేయుత కింద ఆర్ధిక సహాయం అందించగలిగామన్నారు.  తాను విధి నిర్వహణలో 75 సంవత్సరాల వృద్ధురాలు తనతో కలిసివున్న  10 సంవత్సరాల విభిన్న ప్రతిభావంతుడు జీవనం సాగిస్తున్న సంఘటన చూశానన్నారు.  ఆ వృద్ధురాలు తాను చనిపోతే తాను మనవడి పరిస్ధితి ఏమిటని కన్నీరు పెట్టిందన్నారు.  ఈ విషయం చెప్పిన కొన్ని రోజులకు ఆ వృద్ధురాలు మరణించగా  ఆ బాలుడి సంక్షేమ విషయాన్ని అధికారులు ముందు ఉంచానని దానితో వారు హనుమాన్ జంక్షన్ లోని మంచి ఆశ్రమంకు చేర్చారన్నారు.  అదే విధంగా మరో వృద్ధురాలు తిండి, తిప్పలు లేకుండా  అర్ధరాత్రి సమయంలో తన కంటపడగా ఆవిషయాన్ని అధికారులు దృష్టికి రాత్రి 12 గంటల సమయంలోనే తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ఆమెకు ఆహారం ఏర్పాటుచేసి ఓల్డేజిహోంకు తరలించడం జరిగిందన్నారు.  ఇటువంటి విషయల్లో తాను చేసిన సహాయం ఎంతో తృప్తిని కలిగిస్తుందన్నారు.  వాలంటీర్లను ఆయా కుటుంబాలు వారి బిడ్డలు కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారన్నారు.   ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కె.రవికుమార్ ,డిఆర్ డి ఎ పిడి ఆర్. విజయ రాజు, మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటకృష్ణ ,జిఎస్ డ బ్ల్యూఎస్ స్పెషల్ ఆఫీసర్ రమణ తదితరులు పాల్గొన్నారు.

About Author