సంక్షేమ వార్షిక కేలండర్ ఆవిష్కరించిన మాజీ ఉపముఖ్యమంత్రి
1 min read– పాల్గొన్న సమాచార శాఖ ఏడి ఎస్ భవాని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ది అందిస్తున్నామనేది సంక్షేమ క్యాలెండర్ ద్వారా ముందుగానే ప్రకటించి తదనుగుణంగా ఆయా పథకాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి,ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ కేలెండర్ ను మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) బుధవారం స్థానిక శ్రీరామ్ నగర్లోని తమ క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ళ నాని మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలను ఇప్పటికే ప్రభుత్వం అమలు చేసిందన్నారు .సంక్షోభాలెన్ని వున్నా ,చెప్పిన సమయానికి పథకాలను అందించడం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని మరెవరికీ సాధ్యం కాదన్నారు . రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారులకు అందేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలను సంబంధించిన వివరాలన్నీ ఈ క్యాలెండర్లో పొందుపరిచారని తెలిపారు . సంక్షేమ పథకాలను ఏ నెలలో సంబంధిత అధికారులు లబ్దిదారులకు అందజేయాలో షెడ్యూల్ వివరిస్తూ క్యాలెండర్లో ఉన్నాయన్నారు.కార్యక్రమంలో జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి ఎస్.భవాని , జిల్లా పౌర సంబంధాల అధికారి ఆర్. వి.ఎస్. రామచంద్రరావు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి సిహెచ్ కె. దుర్గాప్రసాద్ , పాల్గొన్నరు.