PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సోలార్ డ్రైయర్లు ఉల్లి, టమోటా లకు మాత్రమే పరిమితం కాకూడదు..

1 min read

– ఉల్లి, టమోటా  తో పాటు వివిధ రకాల వెజిటబుల్, ఫ్రూట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు మీద కూడా ప్రత్యక శ్రద్ధ వహించండి

జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉల్లి, టమోటా  తో పాటు వివిధ రకాల వెజిటేబుల్, ఫ్రూట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు మీద కూడా ప్రత్యక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ అంశాల పై డిఆర్డిఎ, మెప్మా అధికారులతో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ   సోలార్ డ్రైయర్లు కేవలం ఉల్లి, టమోటా లకు మాత్రమే పరిమితం కాకుండా ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్లెట్స్ లో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్  కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని కలెక్టర్ డిఆర్డిఎ, మెప్మా అధికారులను ఆదేశించారు.  ఆయా ప్రాంతాల్లో  ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్లెట్స్ పండించే   ఏరియాలతో  మ్యాప్  చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లకు మంచి భవిష్యత్ ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.  వీటిని ప్యాకింగ్ చేసే విధానంలో కూడా చాలా చక్కగా ప్యాకింగ్ చేయాలని కావాలంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ వారితో సంప్రదించి ఏ విధంగా వాటిని ప్రిజర్వేటివ్ చేయొచ్చు అనే సలహాలు కూడా తీసుకుందామన్నారు. హౌసింగ్ కి సంబంధించి బిలో బేస్మెంట్ లెవెల్ లో ఉన్న మహిళా సంఘాల   15 వేల మంది లబ్ధిదారులకు సంబంధించి ఇంతకు ముందు లోన్లు తీసుకుని,ప్రస్తుతం రాకుండా ఉంటే  వారికి ప్రత్యామ్నాయంగా  ఏ విధంగా లోన్ ఇవ్వొచ్చు అనే అంశాన్ని డిఆర్డిఏ పిడి, మెప్మా పిడి పరిశీలించాలన్నారు.. ఆ లబ్దిదారుల వివరాలను   డిఆర్డిఏ పిడి, మెప్మా పిడికి ఇవ్వాలని హౌసింగ్ స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జునుడిని కలెక్టర్ ఆదేశించారు.జగనన్న తోడుకి సంబంధించిన వచ్చిన అప్లికేషన్లను, టి  డ్కో గృహాలకు సంబంధించి వచ్చిన అప్లికేషన్లను వచ్చే సమావేశం బ్యాంకర్లతో నిర్వహించి అందుకు తగిన చర్యలు తీసుకుందామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆదోని ఏరియా డెవలప్మెంట్ లో భాగంగా అక్కడున్న ప్రజలకు స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిఆర్డిఎ, మెప్మా అధికారులు పాల్గొన్నారు.

About Author