ప్రజా సంక్షేమమే ధ్యేయం
1 min read– పార్టీలకు అతీతంగా లబ్ధిదారుల ఇళ్లవద్దకే సంక్షేమ పథకాలు
– 3వ వార్డ్ ప్రజలకు సంక్షేమ పథకాలను వివరిస్తున్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రతి గడపకు వెళ్లి..ప్రభుత్వ పథకాలను వివరిస్తూ…ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ఆప్యాయంగా ప్రజలును పలుకరిస్తూ ..సమస్యల పరిష్కార దిశగా సాగిన కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కర్నూలు నగరం లోని 3వ వార్డ్ 6వ సచివాలయం బండి మేట వీధిలో నిర్వహించిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన. సంక్షేమ పథకాల రారాజు సీఎం జగన్ అన్న గారు అని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు అన్నారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారికి మరియు వార్డ్ కార్పొరేటర్ షాజహాన్ పర్వీన్ గారికి, వార్డ్ ఇంచార్జి ఖాదర్ బాషా గారికి పూలదండలు బొకేలతో ఘనంగా స్వాగతం పలికిన వార్డు ప్రజలుఈరోజు ఆదివారం సాయంత్రం కొనసాగిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అమలు చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు అన్నారు. కర్నూలు నగరంలోని 3వ వార్డ్ 6వ సచివాలయం పరిధిలోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం వైసిపి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మన కు మన ప్రభుత్వానికి జగనన్నని ఆశీర్వదించాలని కోరారు.జగనన్న పరిపాలనలోనే సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అన్నారు. వీధిలో ఉన్న డ్రైనేజీ, మురికి కాలువల సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు సనుకూలంగా స్పందించి సమస్యలను తీర్చేందుకు మున్సిపాలిటీ సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో స్థానిక వార్డ్ కార్పొరేటర్ షాజహాన్ పర్వీన్ గారు వార్డ్ ఇంచార్జి ఖాదర్ బాషా గారు,వైస్సార్సీపీ వార్డ్ ముఖ్య నాయకులు, కన్వీనర్లు ఖుద్ధుస్ గారు,చంద్ బాషా గారు,నజీర్ అహ్మద్ గారు, ముజహీద్ గారు,శేఖర్ గారు, భీమన్నా గారు,గౌసియా గారు,జయబాయ్ గారు, హకీమ్ భాయ్ గారు,అంజు భాయ్ గారు, అక్బర్ గారు, మాకబుల్ గారు, రాజు గారు, ఫారజానా గారు, కరీముల్లా గారు, మున్నా గారు, సాహెబ్ గారు మరియు ఎలక్ట్రికల్ ఎ.ఈ,లు మదన్ మోహన్ గారు,లైటింగ్ సూపరింటెండెంట్ జగదీష్ గారు,ఆర్.పి లు, సచివాలయం సిబ్బంది, అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.