PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పర్యావరణహిత జీవన శైలిపై ప్రతిఒక్కరిలో అవగాహన కల్పించాలి..

1 min read

– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పర్యావరణహిత జీవన శైలి పై అవగాహన కలిగి పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములుకావాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు.స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం కాలుష్యనియంత్రణ మండలి ఏలూరు వారి ఆధ్వర్యంలో మిషన్ లైఫ్ కార్యక్రమంలో బాగంగా లైఫ్ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్బంగా మిషన్ లైఫ్ ద్వారా అవగాహనా కల్పించే గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ పర్యావరణ అనుకూల జీవనశైలి గురించి మిషన్ లైఫ్ ద్వారా రూపొందించిన 75 కార్యక్రమాలను  ప్రజలందరూ ఆచరించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కొరకు మన దినచర్యలలో నిర్దేశించిన సాధ్యమైనన్ని మార్పులు చేసుకోవాలన్నారు.  శక్తివనరులను పొదుపుగా వాడుకోవాలన్నారు.  పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్, బి. లావణ్య వేణి, జిల్లా రెవిన్యూ అధికారి ఎవిఎన్ ఎస్ మూర్తి, ఏలూరు ఆర్డిఓ కె. పెంచల కిషోర్, జెడ్పి సిఇఓ కె. రవికుమార్, పర్యావరణ ఇంజినీర్ కె. వెంకటేశ్వర రావు, డిఆర్ డిఏ పిడి ఆర్. విజయరాజు, పంచాయితీరాజ్ ఎస్ఇ చంద్రభాస్కర్ రెడ్డి, మరియు ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author