ఉద్యమాన్ని ఆపేది లేదు..
1 min read– ప్రభుత్వానికి అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు హెచ్చరిక
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : న్యామమైన ఉద్యోగుల డిమాండ్స్ పరిస్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని అమరావతి జేఏసీ చైర్మన్ బోప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేశారు. గత 76 రోజులుగా చేస్తున్న ఉదమం ఫలితంగా కొన్ని శాఖలకు చెందిన ఉద్యోగులకు కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కరించా రని, చాలా సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయని అవి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం స్థానిక రెవిన్యూ భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రభుత్వం ఎంత త్వరగా ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరిస్తే అంతే త్వరగా ఉద్యమాన్ని విరమిస్తామని తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కె రమేష్ మాట్లాడుతూ ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని. పెన్షనర్లకు పెన్షన్ చెల్లించాలని. 11వ పిఆర్సి ప్రతిపాదించిన స్కేల్స్ బయట పెట్టాలని. పెండింగ్ ఉన్న రెండు కొత్త డిఏలు విడుదల చేయాలని. అరియర్స్ చెల్లించాలని. పిఆర్సి అరియర్స్ చెల్లించాలని. 12వ పిఆర్సి కమిషన్ను వెంటనే నియమించాలని. పెండింగ్లో ఉన్న రెండు కొత్త డీఏలను విడుదల చేయాలని. సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ పునర్దించాలని. కాంటాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరించాలని. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు పెంచాలని. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని. ఇ.హెచ్.ఎస్ ద్వారా క్యాష్ లెట్స్ ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో అమలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న ఉదయం 9 గంటలకు స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి రైల్వే స్టేషన్ గోకుల్ టీవీఎస్ షోరూం ఎదురుగా టొబాకో మార్చ్oట్స్ కళ్యాణమండపంలో చేపట్టనున్న మూడవ ప్రాంతీయ సదస్సును ఉద్యోగులు జయప్రదం చేయాలని కోరారు. ప్రతి ఒక్క ఉద్యోగి. కాంటాక్ట్ ఉద్యోగులు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కొందరు సోషల్ మీడియాలో ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం సరైనది కాదని పరోక్షంగా ఏపీఎన్జీవో నాయకత్వంపై చురకలు వేశారు. ఐక్యమత్యం తోటే ఉద్యోగుల ఉద్యమాలు విజయవంతమౌతాయి తప్ప ఇటువంటి విధానం సరైనది కాదని హితవు పలికారు. ఈకార్యక్రమంలో అమరావతి జేఏసీ నాయకులు. ఉపాధ్యాయ. కార్మిక. విశ్రాంత ఉద్యోగులు. కాంటాక్ట్ ఉద్యోగులు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కొరకు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ తీర్మానం మేరకు తలపెట్టిన పోరాటంలో ఎటువంటి స్వార్థం లేదు. మన లక్ష్యం ఉద్యోగుల హక్కుల ప్రయోజనాలు కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ పోరాటంలో ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగులందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.