PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాలో ఎటువంటి పశుగ్రాస కొరత లేదు..

1 min read

– ఈ ఏడాది  అందుబాటులో 79 వేల మెట్రిక్ టన్నుల వరిగడ్డి…

– పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డా : జి నెహ్రూబాబు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లాలో ఎటువంటి పశుగ్రాస కొరత లేదని పశు సంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డా. జి. నెహ్రూబాబు ఒక ప్రకటనలో తెలిపారు.   ఈ ఏడాది 79 వేల మెట్రిక్ టన్నుల వరిగడ్డి అందుబాటులో ఉందన్నారు.  దీంతో పాటు  రైతు భరోసా కేంద్రాలకు ద్వారా రైతులకు 2 వేల 612 మెట్రిక్ టన్నుల సమీకృత దాణాను సబ్సిడీ ద్వారా అందజేయడం జరిగిందన్నారు.  మరో 165 మెట్రిక్ టన్నును గడ్డి విత్తనాలను సబ్సిడీ ద్వారా రైతులకు సరఫరా చేయడం జరిగిందన్నారు.  ఈ దృష్ట్యా జిల్లాలో ఎటువంటి పశుగ్రాస కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.

About Author