ఎం.పి ..WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ ను కఠినంగా శిక్షించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేసిన యం.పి మరియు WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పౌర చైతన్య వేదిక(PCV) ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కలెక్టర్ ఆఫీసు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం..ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఒమ్కార్ గారు మాట్లాడుతూ బ్రిజ్ భూషణ్ లాంటి వ్యక్తి ని తక్షణమే శిక్షించాలని అన్నారు… పౌర చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు డి.రాఘవేంద్ర గారు మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడా వేదికపై అగ్రస్థానంలో ఉన్నటువంటి క్రీడాకారులు దేశ పతాకాన్ని, మన భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేసిన మహిళా రెజ్లర్స్ నేడు ఢిల్లీ నగర శివారుల్లో న్యాయం కోసం పోరాడుతున్నారు. గత నెల రోజుల నుంచి మహిళా మల్లయోదులు ఢిల్లీ లో తమకి న్యాయం చేయమని, బ్రిజ్ భూషణ్ ని WFI అధ్యక్ష పదవి నుంచి తొలగించి, తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఏమీ పట్టనట్లు మౌనంగా ఉండడం సరైనది కాదని వ్యాఖ్యానించారు. అటువంటి అగ్రశ్రేణి క్రీడాకారులకే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయం జరగకపోతే సామాన్యమైన ప్రజల, మహిళల సంగతి ఏమి? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యం.తేజోవతి మాట్లాడుతూ మహిళా రెజ్లర్లకు మద్దతుగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళలు ప్రజలు క్రీడాకారులు అందరూ కూడా ఐక్యంగా ఈ ఉద్యమంలో పాల్గొనాలని వారికి మద్దతు నందించాలని అప్పుడు మాత్రమే విముక్తి లభిస్తుందని, బ్రిజ్ భూషణ్ లాంటి క్రిమినల్స్ కి శిక్ష పడుతుందని అన్నారు… ఈ కార్యక్రమంలో AIDSO విద్యార్థి సంఘం నాయకులు హరీష్ కుమార్ రెడ్డి, మల్లేష్, యువజన సంఘం నాయకులు శ్రీమన్ నారాయణ, రైతు సంఘం నాయకులు ఖాదర్, నాగన్న, బాబు, మహిళా సంఘం నాయకులు ప్రియాంక, రోజా, సంధ్య, సుజాత అనేకమంది క్రీడాకారులు, ప్రముఖులు, న్యాయ వాదులు కరుణాకర్, బాబు సాహెబ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.