సామాన్య ప్రజలపై ధరల భారం.. విద్యుత్ చార్జీలు తగ్గించాలి
1 min read– పాణ్యం మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జి గౌరు చరిత రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని మంగళవారం నాడు ఓర్వకల్ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద పాణ్యం మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జి గౌరు చరిత రెడ్డి నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం లో అత్యంత అతి పెద్ద సోలార్ పవర్ మన రాష్ట్రo లో ఉండగా కరెంట్ బిల్లులు పెంచడం దారుణం ,అని సియం జగన్మోహన్ రెడ్డి చెత కానీ పరిపాలన లో విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. అభివృద్ధి ఎలా చెయ్యాలో చంద్రబాబు కె సాధ్యం అని, తెలిపారు .గౌరు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ లోకేష్ బాబు ఆధ్వర్యంలో యువ గళం లో పెద్ద ఎత్తున్న ప్రజలు స్వచందంగా పాల్గొన్నారని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందని. ముఖ్యంగా నంద్యాల జిల్లా లో జరిగిన సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు టిడిపి నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ సామాన్య ప్రజలపై ధరల భారం మోపుతున్న వైసిపి ప్రభుత్వానికి 2024లో సామాన్య ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారని ఇప్పటికే వైసీపీ నాయకులకు గెలవమని అర్థమై సొంత పార్టీలో అసంతృప్తి పెరిగిపోయిందని ప్రజలు వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఆదరించాలని టిడిపి పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన వెంటనే ధరలను తగ్గించి సామాన్య ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమం లో నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ గౌరు వెంకట రెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మల్లె రాజశేఖర్, తెలుగు యువత అధ్యక్షులు ప్రభాకర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, సర్పంచ్ మోహన్ రెడ్డి సుధాకర్. ఐటీడీపి సభ్యులు నారాయణ, అయూబ్ చిన్నా, మౌలాలి పాల్గొన్నారు.