వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు నీతి కథలు..
1 min read– గ్రంథాలయ శాఖ నిర్వహించే కార్యక్రమంలో సంతోషంగా ఉంది..
– విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : బుధవారం పోతునూరు శాఖా గ్రంధాలయంలో ఉదయం 8 గంటల నుండి విద్యార్థిని విద్యార్థులచే నీతి కథలు చెప్పడం చదివించడం, పుస్తక పఠనం చేయించడం జరిగినది మరియు పద్మశ్రీ అవార్డు అవార్డు గ్రహీత డాక్టర్ మదర్ థెరీసా జీవిత చరిత్ర గురించి చదివించడం ఆమె గురించి అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమం గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు నిర్వహించి పర్యవేక్షించినారు. అనంతరం విద్యార్థులకు స్నాక్స్ అందించడం జరిగింది. వేసవి సెలవుల్లో విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణ, చదువు పట్ల ఆసక్తి , విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో కలిగే ప్రయోజనాలు ఇటువంటి కార్యక్రమాలు గ్రంథాలయ శాఖ ద్వారా నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని పలువురు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.