ఆంజనేయస్వామి మాన్యాన్ని వైసీపీ చరనుండి కాపాడండి: బిజెపి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బిజెపి మండల అధ్యక్షులు కే, బి. దామోదర్ నాయుడు ధ్వర్యంలో హూసేనాపురం గ్రామం ప్యాపిలి మండలం సర్వే నెంబర్ 579-2 నందు అభివృద్ధి నెపంతో శ్రీ ఆంజనేయస్వామి మాన్యం లో రాస్తా వేయడం తక్షణమే ఆపాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు హేమసుందర్ రెడ్డి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వడ్డే మహారాజ్ లు హెచ్చరించారు. ఈసందర్బంగా బుధవారం వారు హుసేనాపురం గ్రామం చేరుకొని రాస్తారోకో నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హిందూ సమాజాన్ని కించపరిచేలా అనేక కార్యక్రమాలు చేస్తుందని ఇప్పటికే అరవై వేల ఎకరాలు దేవాదాయ భూములు అక్రమణకు గురైనయని, మరియు రెండు వందలకు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయాన్ని కేవలం డోన్ నియోజకవర్గం లోనే వందల ఎకరాల దేవాలయభూములు అక్రమణకు గురై పదుల సంఖ్యలో గుడులపై దాడులు జరిగాయని ముఖ్యంగా రాచెర్ల లక్ష్మి నరసింహ ఆలయం లో విగ్రహం తొలగించడం, ముచ్చట్ల మల్లికార్జున ధ్వజస్థాంభం తొలగించడం,డోన్ శ్రీకృష్ణ ప్రహరీ గోడ కూల్చడం, బేతంచెర్ల సిద్దప్ప దేవాలయం లోని నవగ్రహాలను పగులగొట్టడం జరిగిందని అయినా దేవదాయ శాఖ వారు మొద్దూనిద్రలో ఉండి ఇప్పుడు హుస్సేనాపురం లోని వెటర్నరీ కళాశాలకు అనేక మార్గాలు వున్నా స్వార్థ రాజకీయాల కోసం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ భూమిలో దారి వేయడం సరికాదని, దూప దీప నైవేద్యలకు కూడా నోచుకోకుండా చేసి ఆలయాలను మూసేలా చేస్తున్నరని వారన్నారు. ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మీ రామయ్య, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీజ్యోతి, ప్యాపిలి మండల అధ్యక్షులు దామోదర్ నాయుడు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సందే అంజనయ్య, జిల్లా నాయకుడు ఆర్మీ విష్ణువర్ధన్ రెడ్డి డోన్ పట్టణ అధ్యక్షులు పోలా వెంకటేశ్వర్లు,తిమ్మారెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మద్దిలేటి యువనాయకుడు సాయి, మహేంద్ర మల్లికార్జున , మరియు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.