PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యతోనే సామాజిక ఎదుగుదల..

1 min read

– విద్యతో ఎదిగిన  మహానుభావులను ఆదర్శంగా తీసుకోవాలి..

– డాక్టర్ : పొలిమేర హరికృష్ణ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  పేద సామాజిక వర్గాల చిన్నారులు చర్మకారుల కుటుంబాల చిన్నారులను పాలేరుగా కూలీలుగా మార్చి వారి బంగారు భవిష్యత్తును పాడు చేస్తున్నారని రాష్ట్ర చర్మ కారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, YCP నాయకులు డాక్టర్ పొలిమేర హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు .ఏలూరు లోని గన్ బజార్, కబాడీ గూడెం,  శనివారపు పేటలలో చర్మకారులు, పేద సామాజిక వర్గాల వారు నివసించే  కొన్ని ప్రాంతాలలో పల్లె పయనం , ప్రజా చైతన్యం పేరుతో ఆయా సామాజిక వర్గాలతో హరికృష్ణ  మాట్లాడుతూడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గార్ల ఆశయ సాధన కొరకు, చిన్నారుల భవిష్యత్తు కొరకు, మహానుభావుల మార్గాలను కనీసం 5% అయినా ఆదర్శంగా తీసుకుని చిన్నారులను ఇంగ్లీష్ మీడియం మార్గం వైపు నడిపించి చిన్నారులకు బంగారు భవిష్యత్తును అందించాలన్నారు. తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో  చిన్నారులను కూలీలుగా, పాలేరులుగా  మారుస్తున్నారనే ఆలోచనతో సీఎం జగన్ ఇంగ్లీష్ విద్యా బోధన మరియు ఎన్నో విద్య పథకాలు ప్రవేశపెట్టి, అందిస్తున్నారని, వాటిని  అందిపుచ్చుకొని, విద్యా మార్గం వైపు అడుగులు వేయాలన్నారు. విద్యతోనే సామాజిక ఎదుగుదల ఉంటుందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , బాబు జగజ్జీన్ రామ్, జ్యోతిరావు పూలే, అబ్దుల్ కలాంను  ఆదర్శంగా తీసుకోవాలన్నరు,పేద విద్యార్థులను వ్యక్తిగతంగా ప్రోత్సహించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్థానిక శాసనసభ్యులు ఆళ్ల నాని కి , చర్మకారుల  సంక్షేమ సంఘం తరఫున హరికృష్ణ అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశాలలో పలువురు చర్మకారులు ఆయా సామాజిక వర్గాల తల్లిదండ్రులు తదితరులను కలుసుకున్నారు.

About Author