అసంక్రమిత వ్యాధుల సర్వేను వేగంగా పూర్తి చేయండి
1 min read– వైద్యాధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: డయాబెటిస్, హైపటటీస్ తదితర అసంక్రమిత వ్యాధుల సర్వేను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ .మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జిల్లాలో అసంక్రమిత వ్యాధుల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వున్న ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు.హైరిస్క్ కాన్పులు మరియు సిజేరియన్ కాన్పులు ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటి హెల్త్ సెంటర్లలో తప్పకుండ నిర్వహించాలన్నారు. సాధారణ కాన్పులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చేపట్టాలన్నారు. అంగన్వాడి కేంద్రాలలో పోషణ AAP ను, న్యూట్రిషన్ సప్లిమేన్ టేషన్ అప్ లోడ్ చేయాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.