అశ్రునాయానాలతో వీర జవాన్ కు వీడ్కోలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వీర జవాన్ కు గ్రామ ప్రజలు బంధువులు అశ్రునయనాలతో వీడ్కోలు చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం గ్రామం శంకరన్న, లింగమ్మ దంపతుల ముద్దుబిడ్డ శ్రీనివాసులు 42 సo. సి ఆర్ పి ఎఫ్ జవానుగా 18 ఏళ్ల పాటు దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో విధులలో విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు విడిచాడు. హైదరాబాద్ చంద్రాయన గుట్టలో ఉన్న సీఆర్పీఎఫ్ క్వార్టర్స్ లో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో క్వార్టర్స్ లో ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖకు గురయ్యాడు. దీంతో జవాను అక్కడికక్కడే మృతి చెందాడు. సి ఆర్ పి ఎఫ్ బెటాలియన్ గురువారం రాత్రి జవాను మృతదేహాన్ని స్వస్థలం చిన్నహుల్తి గ్రామానికి తీసుకువచ్చారు. జవాన్ పార్థివ దేహాన్ని శుక్రవారం అధికార లాంచనాలతో సి ఆర్ పి ఎఫ్ బెటాలియన్ గ్రామ ప్రజలు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి. మృతునికి భార్య శారదమ్మ, ఇద్దరు పిల్లలు భార్గవి, శ్రీహరి ఉన్నారు. దేశం కోసం సేవలందించాలని లక్ష్యంతో జవానుగా చేరిన అనతి కాలంలోనే జవాన్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బంధువులు గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సిఆర్పిఎఫ్ బెటాలియన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, పోలీసు బృందంతో అంతిమ సంస్కారాలను సాంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు.