PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..

1 min read

– నగరపాలక సంస్థ కమిషనర్  ఎస్ వెంకటకృష్ణ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  ఏలూరు నగరపాలక సంస్థ మేరీ లైఫ్ – మేర స్వచ్ షహార్ ‘ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ అనుకూల అలవాట్ల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఈనెల 24వ తేదీ ఆర్ఆర్ ఆర్ (రెడ్యూస్ రీసైకిల్ రీయూజ్ )కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న సచివాలయంలో ఏర్పాటు చేసియున్న ఆర్ఆర్ఆర్ (రెడ్యూస్ రీసైకిల్ రీయూజ్ )సెంటర్ లో సచివాలయ సిబ్బంది. వాలంటరీలను. డ్వాక్రా సంఘాల సభ్యులను మరియు మెప్మా సిబ్బందిని భాగస్వామ్యులను చేసి ‘రీ యూజ్ ‘ కార్యక్రమలో భాగంగా 400 కిలోల పాత బట్టలను ఆర్ఆర్ఆర్  సెంటర్ల నందు శాకరణ చేయడం జరిగిందన్నారు. ఈ సేకరణ జూన్ 6వ తేదీ వరకు కొనసాగింపబడుతుందని. అందరూ పట్టణ ప్రజలు మీ సమీపంలో ఉన్న వార్డు సచివాలయం నందు గల ఆర్ఆర్ ఆర్ సెంటర్లలో మీ వంతు కృషిగా పాత బట్టలను ఇవ్వవలసిందిగా నగరపాలక సంస్థ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

About Author