రు.21,62,910/- లు విలువచేసే ఐసర్ వాహనం కలెక్టర్ పంపిణీ
1 min read– ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
– జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: చేపల పెంపకం చేపట్టాలనుకునే యువత, రైతులు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు.గురువారం కలెక్టరేట్ ఆవరణలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద నందికొట్కూరు మండలం నెహ్రూ నగర ప్రాంతానికి చెందిన జల్లి శ్రీనివాసులు లబ్ధిదారునికి రు.21,62,910/- లు విలువచేసే ఐసర్ వాహనాన్ని కలెక్టర్ పంపిణీ చేశారు. 40 శాతం సబ్సిడీ మొత్తం రు. 8,00,000/- లు పోను లబ్ధిదారుని వాటాగా 2,16,910 చెల్లించాల్సి ఉంటుందన్నారు. బ్యాంక్ రుణం 11,46,619 రూపాయలు మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య, మత్స్యశాఖ జేడీ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.