ఆత్మ రక్షణకు కరాటే సాధన అవసరం
1 min read– జిల్లా ఉషూ సంఘం చైర్మన్ డాక్టర్ శంకర్ శర్మ
పల్లెవెలుగు వెబ్:యూనివర్సల్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు పెద్ద మార్కెట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించినట్టు డైరెక్టర్ టి. శ్రీనివాసులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఊషూ సంఘం చైర్మన్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ క్రీడాకారులను అభినందిస్తూ కరాటే ఉషూ మార్షల్ ఆర్ట్స నేర్చుకోవడం వల్ల రోగాలను దూరం చేస్తుందని,కరాటే వల్ల ఏకాగ్రత, పట్టుదల,మెమరీ పవర్,సాహసం పెరుగుతుందని,ఆత్మరక్షణకు తోడుపడుతుందని మరియు తల్లిదండ్రులు చదువుతోపాటు కరాటే ఉషూ మార్షల్ ఆర్ట్స్ క్రీడలనుె ప్రోత్సా హించాలని అన్నారు.చిన్నారులు చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ మెంటల్ స్టామినా కూడా పెరుగుతుందని అన్నారు.అనంతరం కలర్ బెల్టులు సాధించిన క్రీడాకారులకు బెల్టులను,సర్టిఫికెట్స్ లను,ఫలహారాలు ప్రధానం చేశారు. డైరెక్టర్ టి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ బెల్ టెస్ట్ లో 29 మంది చిన్నారులు పాల్గొన్నారు 8 ఈవెంట్స్ లో టెస్టులు నిర్వహించామని బ్లాక్ బెల్ట్ సాధించిన ఎం. జయశ్రీ, ఎం.సమంత, డి. అజ్మ, ఎం. సుమంత్ కుమార్, టి. ఎమ్. రవివర్మ, ఎస్ .రయాన్ భాష, వి. సూర్యప్రకాశ్ రెడ్డి, సాధించారని ఎగ్జామినర్లుగా అమ్ముతీశ్వర్ చిన్న శ్రీనివాసులు సుధాకర్ క్రాంతి చిరంజీవులు ఝాన్సీ లేక శ్రీ పాల్గొన్నారు అని మాస్టర్ టి శ్రీనివాసులు తెలిపారు.