ఫ్యాప్టో ఆధ్వర్యంలో… మోకాళ్లపై నిరసన
1 min readట్రాన్స్ ఫర్లో లోపాలు సవరించాలని డిమాండ్
పల్లెవెలుగు: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో ఉన్న లోపాలను సవరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కర్నూలు జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్ కె. ప్రకాశ్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ న్యాయబద్ధంగా జరపాలని, అదేవిధంగా ప్రమోషన్ కౌన్సిలింగ్‌ను మ్యానువల్ పద్ధతిలో జరపాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్ కౌన్సిలింగ్‌ను మ్యానువల్‌గా జరిపేందుకు విద్యాశాఖ మంత్రి ఒప్పుకున్నారని, కానీ ఆన్లైన్లోనే అప్లై చేసేందుకు విద్యాశాఖాధికారులు ప్రయత్నించడం అన్యాయమన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయుల విన్నపం మేరకు పదోన్నతుల కౌన్సిలింగ్‌ను మ్యానువల్‌గా చేయాలని కోరారు. అనంతరం ఎస్టీయూ అధ్యక్షుడు తిమ్మన్న మాట్లాడారు. నిరసన కార్యక్రమంలో ఫ్యాప్టో రాష్ర్ట కార్యనిర్వహక సభ్యులు జి. హృదయ రాజు(APTF-1938) మరియు కర్నూలు జిల్లా FAPTO ఛైర్మన్ గోకారీ, నంద్యాల జిల్లా FAPTO ఛైర్మెన్ మాధవ స్వామి తదితరులు పాల్గొన్నారు.