ప్రేయసి కోసం పాక్ భూభాగంలోకి.. తెలుగోడు..!
1 min readపల్లెవెలుగు వెబ్: అతడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసం వెతుకుతూ వెళ్లాడు. తన ప్రేయసి సొంతూర్లో ఉన్న సంగతి తెలిసి ఆమెను కలుసుకోవడానికి వెళతాడు. అనుకోకుండా పాకిస్థాన్ భూభాగంలోకి అడుగుపెడతాడు. పాక్ అధికారులు అతన్ని అరెస్టు చేస్తారు. ఇదంతా సినిమా కథ అనుకుంటున్నారా ?. కానేకాదు. ఇది నిజమైన ప్రేమకథ. రెండు జీవితాలకు సంబంధించిన నిజజీవిత కథ. ప్రశాంత్ అనే యువకుడు హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు. 2019లో తన ప్రియురాలిని కలుసుకునేందుకు వెళ్లే క్రమంలో పాక్ సరిహద్దులోని పాకిస్థాన్ అధికారులకు చిక్కాడు. ఎలాంటి పాస్ పోర్ట్, వీసా లేకుండా పాక్ భూభాగంలోకి అడుగుపెట్టడంతో ప్రశాంత్ ను పాక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ పాక్ అధికారులకు చిక్కడంతో .. తన కొడుకును కాపాడాలంటూ ప్రశాంత్ తండ్రి హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిశారు. విదేశాంగ శాఖ సహకారంతో ప్రశాంత్ ను తిరిగి రప్పించేందుకు సహకారం తీసుకున్నారు. ప్రశాంత్ ను వాఘా సరిహద్దులో భారత్ కు పాక్ అధికారులు అప్పగించారు. ఈరోజు లేదా రేపు ప్రశాంత్ కుటుంబ సభ్యులను కలుసుకోనున్నారు. ప్రశాంత్ విడుదలతో వారి కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.