ఫ్యాప్టో ఉద్యమాన్ని జయప్రదం చేయాలి
1 min readపల్లెవెలుగు: విద్యా, ఉద్యోగ, ఉపాధ్యాయ రంగంలో వున్న సమస్య ల పై రాష్ట్ర ఫ్యాఫ్టో కమిటీ పిలుపు మేరకు 6 దశల ఉద్యమాన్ని ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు అధిక సంఖ్య లో పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర ఫ్యాప్టో కో ఛైర్మన్ మరియు ఆప్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు గారు , ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓంకార్ యాదవ్ గారు ,జిల్లా చైర్మన్ యస్.గోకారీ, జిల్లా సెక్రటరీ జనరల్ జి.తిమ్మప్ప లు కోరారు. ఈరోజు స్థానిక STU సలాం ఖాన్ భవనం లో ఉదయం 10 గంటలకు FAPTO జిల్లా కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 5 నుండి సెప్టెంబర్ 1 వరకు ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. తదనంతరం స్పందన కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ యన్.మౌర్య గారికి విద్యా,ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల సమస్య ల పై వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఆర్ధిక కార్యదర్శి సేవాలాల్ నాయక్ ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి టి కె జనార్ధన్, ఏపీటీఎఫ్ 257 జిల్లా అధ్యక్షులు రంగన్న, యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్లప్ప, జయరాజు ,STU నుండీ ముదాసిర అహ్మద్, జి నాగరాజు ,DTF నుండి గోపాల్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.