PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెదడులో కణితుల కల్లోలం..!

1 min read

డాక్టర్. సుమంత్ కుమార్. ఎన్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్, కిమ్స్ హాస్పిటల్, కర్నూలు

  • జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే

పల్లెవెలుగు, కర్నూలు:మానవ శరీరం పనితీరు మొత్తం మెదడు మీదే ఆధారపడి పని చేస్తుంది. మెదడులో ఏమాత్రం తేడా వచ్చినా… కల్లోలంగా మారుతుంది జీవితం. శరీరం మొత్తం స్తంభించి పోతుంది. ఇక మెదడులో వచ్చే కణితులు ఇంకా ప్రమాదం. ఈ సమస్య పట్ల జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం. ప్రజలకు ఈ కణితులపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఏటా జూన్‌ 8న వరల్డ్‌ బ్రెయిన్‌ ట్యూమర్‌ డే నిర్వహిస్తోంది. కర్నూలు ప్రాంతంలో ఇటీవల కాలంలో మెదడు కణితులు ప్రమాదాలు నమోదవుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన కర్నాటకు చెందిన  ప్రజలు కూడా కర్నూలుకి వస్తున్నారు. గతంలో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లవలిసి వచ్చేది. అయితే ఇప్పుడు మన కిమ్స్ కర్నూలులో అత్యాధునికి వైద్య పరికరాలు అందుబాటులో రావడం వల్ల మొదడులో వచ్చిన కణితులను తొలగించే వైద్యం సులభతరమైంది.

మెదడు కణితులు, రకాలు? :

మెదడులోని కణజాలాల్లో ఏర్పడే ముద్దను మెదడు కణితి అంటారు. ఇవి రెండు రకాలు. ప్రైమరీ బ్రెయిన్‌ ట్యూమర్, సెకండరీ బ్రెయిన్‌ ట్యూమర్‌. ప్రైమరీ బ్రెయిన్‌ ట్యూమర్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు. సెకండరీ బ్రెయిన్‌ ట్యూబర్లు శరీరంలో వివిధ భాగాల్లో సోకుతాయి. అవి రక్తంలో ప్రవేశించి మెదడుకు చేరతాయి. దీని ద్వారా మెదడులో కణితులు ఏర్పడతాయి. కొన్ని రసాయనాల బారిన పడటం, రేడియేషన్‌ ఎక్కువగా ఉండటం, ఎక్స్‌టీమ్‌ వైరస్‌ బారిన పడటం వల్ల ఈ కణితులు ఏర్పడతాయి.

 లక్షణాలు :

మెదడు కణితుల లక్షణాలను రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటిది జనరల్‌ లక్షణాలు. రెండవది ప్రత్యేకమైనది. జనరల్‌ లక్షణాలు కణితి పరిమాణాన్ని బట్టి వస్తాయి. తలనొప్పి, వాంతులు, చూపు మందగించడం, ఒత్తిడి పెరగడం, స్పృహకోల్పోవడం వంటివి. ఇక రెండవది మెదడులో కణితి ఏర్పడిన స్థానాన్ని బట్టి వస్తాయి. మెదడు ముందు భాగం, మధ్యభాగం, వెనుక భాగంలో ఆయా స్థానాలను బట్టి లక్షణాలు ఉంటాయి. అందులో  మాట తడబడటం, చూపు మబ్బుగా కనిపించడం, చెవులు వినిపించకపోవడం, మూతి వంకరపోవడం, ఫిట్స్‌ రావడం, మాట తడబడటం, పక్షవాతం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రతి తలనొప్పిని కణితికి కారణం అని చెప్పలేము. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులు తప్పనిసరిగా కలవాలి.  

నిర్ధారణ :

మెదడులో కణితులు ఉన్నాయా లేదా అనేది నిర్ధారించడానికి మూడు రకాల పరీక్షలు ఉన్నాయి. మొదటిది క్లినికల్, రెండోది రేడియాలజీ, మూడోది సర్జికల్‌ ద్వారా నిర్ధారిస్తారు. ఇందులో సీటీస్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్‌లో తేలిపోతుంది. కానీ కొందరిలో సర్జికల్‌ ద్వారా కూడా నిర్ధారణ చేయవచ్చు. ఈ స్కాన్‌లలో కణితులను నిర్ధారణ చేసుకున్న తర్వాత చికిత్స ప్రారంభిస్తారు.   

మెదడు కణితులను బట్టి చికిత్స :

మెదడులో ఏర్పడిన కణితులను గ్రేడ్‌ 1, 2, 3, 4 విభాగాలుగా విభజించి చికిత్స అందిస్తాం. అలాగే కణితుల స్థానంపై కూడా ఆధారపడి చికిత్స ఉంటుంది. గ్రేడ్‌ 1, 2లలో ఉన్న కణితులు మూడు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే రేడియేషన్‌ ద్వారా తగ్గించవచ్చు. దీని ద్వారా వారి సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. అయితే గ్రేడ్‌ 3, 4 కణితులు ఉంటే జీవితకాలం జీవించే అవకాశం తక్కువగా ఉంటుంది. రేడియేషన్‌ థెరపీ, కీమోథెరపీ వంటి అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉన్నాయి. ఈ కణితులను త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే మంచింది.

About Author