సమస్యల పరిష్కారానికి..ఉద్యమమే శరణ్యం..: ఫ్యాప్టో
1 min readఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్ కాకి ప్రకాశ్ రావు
పల్లెవెలుగు, కర్నూలు:ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యం మని ఫ్యాఫ్టో రాష్ట్ర కో- చైర్మన్ కాకి ప్రకాశ రావు అన్నారు. ఫ్యాఫ్టో రాష్ట్ర కమిటీ పిలుపు మొదటి దశ కార్యక్రమం లో కార్యక్రమం లో బాగంగా ఈ రోజు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి. నిశాంతి గారికి ఫ్యాఫ్టో నంద్యాల జిల్లా చైర్మన్ మాధవస్వామి సెక్రటరీ జనరల్ సుబ్బన్న ల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఫ్యాఫ్టో రాష్ట్ర కో చైర్మన్ కాకి ప్రకాశరావు మాట్లాడుతూ అనేక సార్లు ప్రభుత్వానికి ఉపాధ్యాయుల సమస్యలను తెలియజేసినప్పటికీ పరిష్కారం రాని సమయంలోనే తప్పని పరిస్థితుల్లో ఉద్యమంలోకి వెళ్ళవలసి వచ్చింది అన్నారు .మన డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయులు అందరూ ఐక్యమై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు ఉపాధ్యాయులను అగౌరవపరిచే విధంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. సిపిఎస్ ను రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వమే హామీ ఇచ్చిందని తెలిపారు వెంటనే సిబిఎస్ రద్దు చేయాలన్నారు. ప్రాథమిక విద్యను నాశనం చేసే జీవో 117 ను రద్దు చేయాలన్నారు. పదోన్నతులు రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టాలన్నారు .పి ఆర్ సి బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో చైర్మన్ జవాన్, కిషోర్ లు,జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ శివయ్య, ఆజం బేగ్,APTF(257) జిల్లా అధ్యక్షుడు రామ చంద్రా రెడ్డి, APTF (1938) రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు,STU జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలాలి,గోపాల కృష్ణ,SC ST ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధనకార్యదర్శి లక్ష్మణ్ నాయక్, ఆప్తా నాయకులు రాజ సాగర్, మహమ్మద్ రఫీ మహబూబ్ భాష యు టి ఎఫ్ నుండి బాల స్వామి మరియు రామకృష్ణ తది తరులు పాల్గొన్నారు.