జర్నలిస్ట్ పిల్లలకు విద్యాసంస్థల్లో…60 శాతం రాయితీ ఇవ్వాలి
1 min read– డీఈఓ ను కోరిన ఏపీజేఎఫ్ నాయకులు
– ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చిన డీఈఓ రంగారెడ్డి
పల్లెవెలుగు: కర్నూలు జిల్లాలో వివిధ ప్రింట్/ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పలువురు నిరుద్యోగులు జర్నలిస్టులుగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తమకు తెలుసని, చాలీచాలని వేతనాలతో జీవనోపాధికి అవస్థలు పడుతున్న జర్నలిస్టుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో పదవ తరగతి దాకా ఫీజు మొత్తాల్లో 60 శాతం రాయితీతో జర్నలిస్టుల పిల్లలకు విద్యను అందించేలా ఆయా యాజమాన్యాలకు ఆదేశాలను జారీ చేయాలని డీఈఓ రంగారెడ్డిని కోరారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ అవకాశం జర్నలిస్టుల పిల్లలకు అందుబాటులో ఉంది. జిల్లాలో సైతం కొన్ని యాజమాన్యాలు 60 శాతం రాయితీతో విద్యను అందిస్తున్నాయి. అయితే కొన్ని యాజమాన్యాలు అందుకు సుముఖత వ్యక్తం చేయనందున తమరు ఈ విషయంలో శ్రద్ధ వహించి, జర్నలిస్టుల పిల్లలకు తగిన న్యాయం చేయాలని విన్నవించారు. ఇందుకు స్పందించిన డీఈఓ రంగారెడ్డి … ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టి.రామకృష్ణ జిల్లా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం, యం. సాయికుమార్ నాయుడు జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్యాముల, కుమార్, ప్రసాద్, రామ స్వామి, సురేష్, శ్రీనివాసులు, బ్రహ్మయ్య, ఉరుకుందు తదితరులు పాల్గొన్నారు.