ఎస్సీ ఎస్టీ సమస్యలపై దృష్టి సారిస్తాం
1 min read
ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్
వెలుగోడు: మండలంలోని ఎస్సీ ఎస్టీ సమస్యలపై దృష్టి సారిస్తామని నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ చిటికెల సలోమి అన్నారు. బుధవారం ఆమె వెలుగోడు తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహాసిల్దార్ శ్రీనివాసులు, ఎస్సై జగన్ మోహన్ లతో సమస్యలపై ఆరా తీశారు. ఆమె మాట్లాడుతూ తమ పరిధిలోని సమస్యలను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తుంటామని అన్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను వాటి పరిష్కార మార్గాలకై ఉన్నతాధికారులకు చేరవేస్తామని తెలిపారు.