‘పీఎం కిసాన్‘కు .. ఈకేవైసీ తప్పనిసరి..
1 min readజిల్లా వ్యవసాయ అధికారి పిఎల్ వరలక్ష్మి
పల్లెవెలుగు:రైతుల సంక్షేమార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి పి.ఎల్.వరలక్ష్మి. పీఎంకిసాన్ పథకం కింద జిల్లాలో 27,607 మందికి 13వ విడత కింద నగదు జమ అయిందని, కానీ వారందరూ ఈకేవైసీ చేయించుకోలేదని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. నగదు జమ అయినా…ఈకేవైసీ చేయించుకోని వారి జాబితాను రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శించామని, జాబితా నందు రైతుల ఆధార్ సంఖ్యను కూడా పొందుపరిచామన్నారు. రైతులు జాబితాలో తెలిపిన వివరాలను సరి చూసుకుని ఈకేవైసీ తప్పక చేయించుకోవాలని సూచించారు. లేదంటే 14వ విడత నగదు జమ కాదని ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పిఎల్ వరలక్ష్మి వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ లోపు ఈకేవైసీ చేయించుకోవాలని రైతులకు సూచించారు.