PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘అంగన్​వాడీ’లు.. విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

1 min read

 పిల్లల బరువు, ఎదుగుదలపై ప్రత్యేక దృష్టిసారించండి..

  • నాణ్యమైన..పౌష్టికాహారం అందించండి..
  • అంగన్​వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉషా శ్రీ చరణ్

పల్లెవెలుగు, ఆదోని:కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని సంజీవ నగర్  కాలనీ నందు 25, 26, 27 వ అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఉషా శ్రీ చరణ్  గురువారం  ఎమ్మిగనూరు పట్టణంలోని సంజీవ నగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి వర్యులు తనిఖీ చేసి పౌష్టికాహారం కేంద్రంలో వారు పెడుతున్న ఆహారాన్ని అడిగి తెలుసుకున్నారు. పిల్లల మానసిక అంశాలను గమనిస్తూ ఉండాలని మంత్రి వర్యులు అన్నారు. కేంద్రంలో ఉన్న పౌష్టిక ఆహారం గుడ్లు, చిక్కి, పాలు, బియ్యం, మొదలగు వాటిని తనిఖీ చేసి గర్భిణీల స్త్రీలకు నాణ్యతమైన పౌష్టికాహారం అందజేయాలని అధికారులకు సూచించారు. పిల్లలను అక్షరాలు, రైమ్స్ వారితో చెప్పించారు. కేంద్రంలో ఉన్న ఇద్దరు చిన్నారులను వారి శరీరం బరువును మంత్రివర్యులు స్వయంగా పరిశీలించారు. చిన్నారుల బరువు తగ్గుదల గల కారణాలను విశ్లేషించి తదనుగుణంగా పోషక ఆహారాన్ని అందించాలని మంత్రి పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఉంటున్న పిల్లల బరువు, ఎదుగుదల తక్కువగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి వర్యులు తెలిపారు. నిరంతరం అంగన్వాడి కేంద్రాలను ఉన్నత అధికారులు తనిఖీలు చేయాలన్నారు. విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సంబధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం మంత్రి వర్యులు రిజిస్టర్లను హాజరు పట్టికను మంత్రి వర్యులు పరిశీలించారు. అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న భోజన సదుపాయాల గురించి  అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమామహేశ్వరమ్మ, సిడిపిఓ సఫర్ నిషా బేగం, సీనియర్ నాయకులు జగన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్,  సిబ్బంది పాల్గొన్నారు.

About Author