PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమెరికాలో ఉన్నత విద్యపై .. 20న ‘ఎడ్యుకేష‌న్ ఫెయిర్‌’

1 min read

* 15 అగ్రస్థాయి విశ్వవిద్యాల‌యాల్లో ప్రవేశాల‌కు 300 కోర్సులు

* అర్హులైన విద్యార్థుల‌కు వారం రోజుల్లో ప్రవేశాలు ఖ‌రారు

హైద‌రాబాద్‌: అమెరికాలో ఉన్నత‌విద్యను అభ్యసించాల‌నుకునే విద్యార్థుల కోసం హైద‌రాబాద్‌లోని అమీర్‌పేట‌లో ప్రత్యేకంగా ఎడ్యుకేష‌న్ ఫెయిర్‌ను యూనివ‌ర్సిటీ హ‌బ్ నిర్వహిస్తోంది.  మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు చ‌దువుకున్నవారు ఎవ‌రైనా ఇందులో పాల్గొన‌చ్చు. యూనివ‌ర్సిటీ హ‌బ్ వెబ్‌సైట్ (https://universityhub.com/) ద్వారా లేదా 6387149133 నంబ‌రుకు వాట్సాప్ చేయ‌డం ద్వారా లేదా మంగ‌ళ‌వారం నేరుగా వ‌చ్చి కూడా రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు. భారీ మొత్తంలో స్కాల‌ర్‌షిప్‌లు, త్వర‌గా ప్రవేశార్హత‌ల నిర్ణయంతో 15 అగ్రశ్రేణి యూనివ‌ర్సిటీలు ఇందులో పాల్గొంటాయి. స్టెమ్ ఆధారిత హైబ్రిడ్ ప‌ద్ధతిలో ఉద్యోగం చేసుకుంటూ చ‌దువుకునే అవ‌కాశం విద్యార్థుల‌కు క‌ల్పిస్తూ, త‌ద్వారా వారు అమెరికాలో చ‌దువుకోవాల‌న్న త‌మ క‌ల‌ను సుల‌భంగా నెర‌వేర్చుకోడానికి సాయ‌ప‌డ‌తారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు అమీర్‌పేట‌లోని ఆదిత్యపార్కు హోట‌ల్లో ఈ కార్యక్రమం జ‌రుగుతుంది.

విభిన్న యూనివర్శిటీల నుంచి ఎంపిక: యూనివర్శిటీ హబ్​ సీఈఓ డా.అనిల్​

ఈ సంద‌ర్భంగా యూనివ‌ర్సిటీ హ‌బ్ సీఈఓ డాక్ట‌ర్ అనిల్ ప‌ల్లా మాట్లాడుతూ, “భార‌త‌దేశంలో బీటెక్, బీఏ, బీఎస్సీ, లేదా మ‌రేదైనా డిగ్రీ చ‌దివి 2023 ఫాల్ సీజ‌న్‌లో అమెరికాలో ఉన్నత విద్య చ‌ద‌వాల‌నుకునే కొత్త విద్యార్థుల‌పై ప్రత్యేక దృష్టితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇక్కడ విద్యార్థుల‌కు విభిన్నమైన యూనివ‌ర్సిటీల నుంచి ఎంపిక చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అడెల్ఫీ యూనివ‌ర్సిటీ, గోల్డెన్ గేట్ యూనివ‌ర్సిటీ, కంబ‌ర్లాండ్ యూనివ‌ర్సిటీ, ఆండ‌ర్సన్ యూనివ‌ర్సిటీ, యూడ‌బ్ల్యుఎల్ఏ, మార్షల్ యూనివ‌ర్సిటీ, టోలెడో యూనివ‌ర్సిటీ, లూయిస్‌విల్లె యూనివ‌ర్సిటీ, యూనివ‌ర్సిటీ ఆఫ్ సౌత్ అల‌బామా, జ‌డ్సన్ యూనివ‌ర్సిటీ, యూనివ‌ర్సిటీ ఆఫ్ కంబ‌ర్లాండ్స్, ముర్రే స్టేట్ యూనివ‌ర్సిటీ, ఆల్డర్సన్ యూనివ‌ర్సిటీ, ఫాల్క‌న‌ర్ యూనివ‌ర్సిటీ, ఆల్డర్సన్ బ్రాడ‌స్ యూనివ‌ర్సిటీ, యూనివ‌ర్సిటీ ఆఫ్ లూయిస్ విల్లేల ప్రతినిధులు ఇక్కడ‌కు వ‌స్తారు” అని తెలిపారు.

విద్యార్థుల‌కు ప్రయోజ‌నాలు:

విద్యార్థుల‌కు అక్కడిక‌క్కడ అంచ‌నా వేసుకుని, అక్కడ అందుబాటులో ఉన్న యూనివ‌ర్సిటీలు, వాటిలో కోర్సుల గురించి వాటి ప్రతినిధుల‌తో నేరుగా మాట్లాడేందుకు అవ‌కాశం ఉంటుంది. అర్హ‌తా ప్రమాణాలు అందుకున్న విద్యార్థులకు కావల్సిన  ప‌త్రాల‌న్నీ సిద్ధంగా ఉంటే, వారం రోజుల్లోగా ప్రవేశాల‌ను ఖ‌రారు చేస్తారు, మ‌రో వారంలో వారికి కూడా వ‌చ్చేస్తుంది. ఇదంతా కేవ‌లం యూనివ‌ర్సిటీ హ‌బ్ ద్వారానే సాధ్యమ‌వుతుంది, ప్రతి యూనివ‌ర్సిటీలో ఇందుకు ప్రత్యేకంగా కొంత‌మంది సిబ్బంది ఉంటారు.

“ఉదాహ‌ర‌ణ‌కు గ‌త సంవ‌త్సరం నుంచి మేం ఆడెల్ఫీ, గోల్డెన్ గేట్ యూనివ‌ర్సిటీల‌తో గ‌త సంవ‌త్సరం నుంచి ప‌నిచేస్తూ, ట్యూష‌న్ ఫీజు త‌గ్గించాల‌ని కోరుతున్నాం. సాధార‌ణంగా అడెల్ఫీ యూనివ‌ర్సిటీలో చ‌ద‌వాలంటే 45వేల డాల‌ర్ల ఫీజు క‌ట్టాలి. అదే మా ద్వారా అయితే కేవ‌లం 22వేల డాల‌ర్లు క‌డితే స‌రిపోతుంది” అని డాక్టర్ అనిల్ ప‌ల్లా తెలిపారు. 

తక్కువ ఫీజుతో…సరైన విద్య..

అమెరికా యూనివ‌ర్సిటీల‌లో ఉండే భారీ ఫీజుల దృష్ట్యా, అమెరికా వీసా వ‌చ్చి, అక్కడ‌ దిగిన త‌ర్వాత మొద‌ట్లో దాదాపు 20% మంది విద్యార్థులు ముందుగా త‌మ‌కు సీటు వ‌చ్చిన యూనివ‌ర్సిటీ కాకుండా వేరే చిన్న యూనివ‌ర్సిటీకి  మారేవారు. ఇప్పుడు అది 40%కు పెరిగింది. ఇలాంటి అవ‌స‌రం లేకుండా ఉండేందుకు యూనివ‌ర్సిటీ హ‌బ్ మంచి విద్యాసంస్థల‌తో క‌లిసి కృషిచేస్తోంది. విద్యార్థుల‌కు నాణ్యమైన విద్యను వీలైనంత త‌క్కువ ఫీజుల్లో అందుబాటు ఉంచి, స‌రైన యూనివ‌ర్సిటీని విద్యార్థులు ఎంచుకునేలా చేస్తోంది.

About Author