‘సీమ’లో.. బీసీలకు రక్షణేదీ…?
1 min read- ఎస్సీఎస్టీ కేసులతో బీసీలను అణగదొక్కుతున్నారు..
- వైసీపీ ప్రభుత్వం.. బీసీలకు చేసింది శూణ్యం
- బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి
పల్లెవెలుగు: రాయలసీమలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని, ఎక్కడ ఏం జరిగినా బీసీలపైనే కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి. కర్నూలు జిల్లా ఆదోనిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నేతృత్వంలో జరిగిన బీసీ సామాజిక సభలో ఆయన ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసిందేమీలేదన్నారు. గతంలో బీసీ కార్పొరేషన్ కింద బీసీ కులాల యువతకు, చిరువ్యాపారులకు రుణాలు ఇచ్చేవారని, వైసీపీ ప్రభుత్వంలో సబ్సిడీ రుణాలు ఎందుకు ఇవ్వడంలేదని ఘాటుగా ప్రశ్నించారు. ఒక్క బీసీ కార్పొరేషన్ ఉన్నప్పుడు బీసీ కులాలకు చెందిన అర్హత గల వారికి రుణాలు ఇచ్చేవారని, జగన్ రెడ్డి ప్రభుత్వం 56 కార్పొరేషన్లుగా చేసి బీసీలను విడగొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఆత్మ గౌరవం కోసం జాతీయ బీసీ కమిషన్కు చట్టబద్దత చేసి.. రాష్ట్రంలోనూ బీసీ జాతీయ కమిషన్కు చట్టబద్ధత కల్పించాలని ఆదేశించడమేకాక.. ఎస్సీ ఎస్టీలకు ఉన్న హక్కులు బీసీలకు ఉండాలని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆదేశిస్తే…. అరాచక ప్రభుత్వం బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. అదేవిధంగా రైతులకు పంట నష్టపరిహారం… గిట్టుబాటు ధర కల్పించకపోగా… అన్నదాతలను ఇబ్బందులు పెట్టేలా చర్యలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సామాజిక సభ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.