ఇంటర్ విద్యార్థులకు…పాఠ్య పుస్తకాలు అందించాలి
1 min readఇంటర్మీడియట్ విద్యామండలి నిధులను దారి మళ్లించడం అన్యాయం..
- AIDSO నగర కార్యదర్శి హెచ్. మల్లేష్
పల్లెవెలుగు: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాలని AIDSO నగర కార్యదర్శి హెచ్. మల్లేష్ జిల్లా విద్యాశాఖ అధికారులను కోరారు. సోమవారం AIDSO నగర కమిటీ ఆధ్వర్యంలో DVEO జమీర్ భాషకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హెచ్. మల్లేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వమే ఉచితంగా అందించేదని, అయితే గత సంవత్సరం నుండి విద్యార్థులకు అందించకపోవడం కారణంగా వేలాదిమంది విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, దాని ఫలితమే నేటి ఇంటర్మీడియట్ పరీక్షల ఉత్తీర్ణత శాతం పూర్తిగా తగ్గిపోయిందన్నారు… ఇప్పటికే విద్యార్ధుల నుండి ఫీజుల పేరుతో వేళల్లో విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నారని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే వారంతా పేద విద్యార్థులే అని గుర్తు చేశారు… ఉచిత విద్య అందించాల్సిన ప్రభుత్వాలు విద్యను కూడా వ్యాపారం చేసే విధానాలు చేపడుతున్నారని విమర్శించారు… ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకాలు మీరే కొనుక్కోండి అని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ తెలియజేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించాలని కోరారు.