ప్రజల భవిష్యత్తుకు..టీడీపీగ్యారంటీ: టిజి భరత్
1 min readపల్లెవెలుగు: ప్రజల భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీ గ్యారెంటీ ఇస్తుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి భరత్ అన్నారు. నగరంలోని 7వ వార్డు పరిధిలోని మేదర వీధిలో ఆయన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వారితో మాట్లాడి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను అందజేశారు. వీటితోపాటు కర్నూలు ప్రజల క్షేమం కోరుతూ ఆయన సొంత ఖర్చుతో ప్రజలందరికీ ఉచిత వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. రూ. 3 వేల రూపాయలు విలువగల వైద్య పరీక్షలను ఉచితంగా చేపిస్తున్నానని.. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గౌరి గోపాల్ హాస్పిటల్ లో వెళ్లి పరీక్షలు చేపించుకోవాలని చెప్పారు. కరోనా తర్వాత ప్రజలు గుండె జబ్బుల బారిన పడి మృతి చెందిన సందర్భాలను గుర్తు పెట్టుకొని ఈ ఉచిత వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ మొదటి విడత మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను వెళ్లిన ప్రతి ఇంటిలో ప్రజలు ఏదో ఒక సమస్యను చెబుతూనే ఉన్నారన్నారు. ప్రజలందరి సమస్యలు తీరాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. కర్నూల్ లో వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఒక అవకాశం తనకు ఇచ్చి చూడాలని.. అప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగిస్తానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని టీజీ భరత్ వివరిస్తూ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కలీం భాయ్, శివానంద్, అబ్దుల్లా, బషీర్, సుజాత, ఫహద్, గులాబ్, మాజీద్, యూనుస్, అహ్మద్ అలీ ఖాన్, మహబూబ్ బాషా, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.