లాక్ డౌన్.. ఆ ఊర్లో మద్యం హోండెలివరీ చేయొచ్చు..!
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన వైరస్ విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేశారు. మద్యం దొరక్క మందుబాబులు విలవిలలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం డిమాండ్ దృష్టిలో పెట్టుకుని హోం డెలివరీకి అనుమతి ఇచ్చింది. ఇది కూడ కేవలం ఎల్-14 లైసెన్స్ ఉన్నవారికి మాత్రమే మద్యం హోం డెలివరీ చేయడానికి అనుమతి ఉంది. గతంలో కూడ ఢిల్లీలో మద్యం హోం డెలివరీకి అనుమతి ఉంది. అది కూడ ఈమెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వార బుక్ చేసుకుంటే మాత్రమే హోం డెలివరీ చేస్తారు. అయితే… ఇప్పుడు ఆన్ లైన్ యాప్స్, పోర్టల్స్ ద్వార బుక్ చేసుకున్నా సరే హోం డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ప్రజలు గుమికూడకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ చట్టంలో సవరణలు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోన వైరస్ కేసుల పాజిటివిటీ రేటు తగ్గడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.