డ్రగ్స్రహిత సమాజమే లక్ష్యం: సీఐ
1 min readపల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో:యువత మేల్కొని డ్రగ్స్ రహిత సమాజ ఏర్పాటుకు కృషి చేయాలని వీరబల్లి మండల సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట యువతవీరబల్లినియోజకవర్గంలోని వీరబల్లి మండల కేంద్రంలో. ఎస్డీకేఆర్ డిగ్రీ కళాశాలలో బుధవారం డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి, కొకైన్, హేరయిన్ తదితర మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనము చేసుకుంటున్నారన్నారు. అపరిచిత వ్యక్తులు డ్రగ్స్ అమ్మిన తీసుకున్న టోల్ ఫ్రీ నంబర్14500కు కాల్ చేసి వివరాలు తెలపాలి అన్నారు. ఎస్డీకేఆర్ కళాశాల డైరెక్టర్ రవిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి, గుట్కా కిక్కుతో యువత మునిగి తేలుతున్నారన్నారు.డ్రగ్స్ నిర్ములన కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని దానికి తోడుగా యువతలో డ్రగ్స్ మహమ్మారి వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డీకేఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.