యోగాతో…ఆరోగ్యం..:నర్రా పేరయ్య
1 min read– కర్నూలు జిల్లా మాజీ సైనికుల సంఘం, మాజీ సైనిక్ బోర్డు నేతృత్వంలో ప్రపంచ యోగా దినోత్సవం
పల్లెవెలుగు: యోగాసనాలతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, ప్రతిఒక్కరూ యోగాను నిత్యకృత్యంగా మార్చుకోవాలని సూచించారు కర్నూలు జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు నర్రా పేరయ్య. ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని బుధవారం జిల్లా మాజీ సైనికుల సంఘం , జిల్లా సైనిక్ బోర్డు సంయుక్తంగా 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనిక్ సంఘం సభ్యులు, జిల్లా సైనిక్ బోర్డు సిబ్బంది యోగాసనాలు చేశారు. అనంతరం నర్రా పేరయ్య మాట్లాడుతూ మానవ జీవన శైలిలో యోగా ఒక భాగం కావాలని, అప్పుడే ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందన్నారు. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా యోగాసనాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సైనిక్ బోర్డు అధికారితోపాటు కర్నూలు జిల్లా మాజీ సైనికుల అడ్వైజర్ కేసి రాముడు, సైనికులు పాల్గొన్నారు.