టిజి భరత్ సమక్షంలో టిడిపిలో చేరిన మహిళలు
1 min readపల్లెవెలుగు: కర్నూలు నగరంలోని 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్ కు చెందిన మహిళలు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ సమక్షంలో టిడిపిలో చేరారు. మౌర్య ఇన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టిజి భరత్ వీరికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టిజి భరత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కర్నూల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలు అందించి వివరించారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. అనంతరం టిజివి సంస్థల ఆద్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య పరీక్షల కరపత్రాలను అందజేశారు. రూ. 3 వేలు విలువగల వైద్య పరీక్షలను కర్నూలు ప్రజల కోసం ఉచితంగా అందిస్తున్నామని.. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని భరత్ కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు రాజశేఖర్ రెడ్డి, శివన్న, నరేష్, ఈశ్వరయ్య, మహిళలు మేరి, జయమ్మ, ఝాన్సీ, కెజియా, దేవమ్మ, పర్వీన్ బేగం, రేష్మ, ఆసియా, రెహానా, తదితరులు పాల్గొన్నారు.