శాశ్వత లోక్ అదాలత్‌పై ‘అంగన్‌వాడీ’లకు అవగాహన
1 min readపల్లెవెలుగు: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. శ్రీనివాస రావు గారి ఆదేశాల మేరకు గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు, ప్రజా వినియోగ సేవల కోసం శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షులు వెంకట హరినాథ్ మరియు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ ఎస్. మనోహర న్యాయ సేవ సదన్ నందు అంగన్‌వాడీ కార్యకర్తలకు చట్టపరమైన అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సదస్సు లో వాయుమార్గం, జల మార్గం మరియు రహదారుల ద్వారా ప్రయాణీకులను సరుకులను రవాణా చేసే సేవలు సౌకర్యాలు. తంతి, తపాలా, టెలిఫోన్ సేవలు. విద్యుచ్ఛక్తి, కాంతి మరియు నీరు ప్రజలకు సరఫరా చేసే సంస్థలు. ప్రజా రక్షణ మరియు పారిశుధ్యం. వైద్య శాలలు, చికిత్సలయాలలో అందించే ఆరోగ్య సేవలు. జీవిత భీమా సేవలు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. విద్య మరియు విద్యా సంస్థల సేవలు. గృహములు మరియు రియల్ ఎస్టేట్ సేవలకు సంభందించి, వినియోగదారులకు మరియు ఆయా సంస్థలకు గల వివాదములను కోటి రూపాయలు పరిధి వరకు ఎటువంటి కోర్టు ఫీజు ఖర్చు లేకుండా సత్వరంగా పరిష్కరించుటకు గాను ప్రజా ప్రయోజనాల శాశ్వత పీఠమును ఏర్పాటు చేశారు. కోర్టులో వ్యాజ్యము దాఖలు చేయకముందే ఈ శాశ్వత పీఠమును ఆశ్రయించవచ్చును. ఉన్నత న్యాయ సేవ అధికార సంస్థ ఏర్పాటుచేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ సిస్టమ్ ద్వారా అందిస్తున్న మెరుగైన ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చును అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు గారు, ప్రజా వినియోగ సేవల కోసం శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షులు శ్రీ వెంకట హరినాథ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్, శ్రీ ఎస్. మనోహర గారు, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.