PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ కార్యాలయం ప్రారంభించిన టీజీ భరత్​

1 min read

పల్లెవెలుగు: కర్నూలు నగరంలోని 52 వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వార్డు కార్యాలయాన్ని కర్నూలు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి టిజి భరత్ ప్రారంభించారు. వార్డు నేతలు మోతిలాల్, సర్దార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యాలయాన్ని ప్రారంభించి నేతలతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో టిజి భరత్ మాట్లాడుతూ స్థానికంగా ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు భరోసానివ్వడం శుభ పరిణామం అన్నారు. ఇందుకు ముందుకు వచ్చిన నేతలను అభినందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని విషయం తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ప్రజలందరికీ తనమీద ప్రేమ ఉంటే సరిపోదని.. ముందు ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నారు. లేకపోతే తక్షణమే వెళ్లి ఓటు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. సరైన నాయకుడు లేకపోతే 5 ఏళ్ళు భరించాల్సి వస్తుందన్నారు. ఒక్క ఓటు కూడా ఎంతో కీలకమని.. సరైన నాయకుడు ఉంటే ఐదేళ్లపాటు సంతోషంగా ఉండి నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. కర్నూలు ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలన్న ఉద్దేశ్యంతో తన తండ్రి చెక్ డ్యామ్ నిర్మించేందుకు ఒక జీవో తీసుకొచ్చారని.. అయితే ఆయన ఓడిపోయిన తర్వాత వచ్చిన నేతలు ఆ జీవోను పక్కకు పెట్టేసారన్నారు. తన తండ్రి గెలిచి ఉంటే కర్నూలు ప్రజల తాగునీటి కష్టాలు తీరేవని, దీంతోపాటు పరిశ్రమలు తీసుకువచ్చి స్థానికంగా ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వారన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని.. ప్రజాసేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. తనకు వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలన్నారు. ఎన్నికల సమయంలో కులం, మతం చూడకుండా మంచి నాయకుడు ఎవరో ఆలోచించి ఓటు వేయాలన్నారు. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే తన తండ్రి కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తానన్నారు. తాను చేసే అభివృద్ధిని చూసి 2029 ఎన్నికల్లో కూడా మళ్లీ తనని గెలిపిస్తారని చెప్పారు. ఇక స్థానికులు స్థానికంగా షాది ఖానా కావాలని టిజి భరత్ ను అడగ్గా.. భరత్ మాట్లాడుతూ తన తండ్రి హయాంలో కమ్యూనిటీ హాల్స్ ఎన్నో నిర్మించారని ఆ తర్వాత వాటన్నింటినీ ఇతర ఉపయోగాలకు వాడుకుంటున్నారని చెప్పారు. సరైన నాయకుడు లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు బొల్లెద్దుల రామకృష్ణ, వేణు, బషీర్, చాంద్, శాంతప్ప,  తదితరులు పాల్గొన్నారు.

About Author