ఏపీ అభివృద్ధి..కాంగ్రెస్తోనే సాధ్యం
1 min readఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని విధాల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.శుక్రవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని పిసిఆర్ గ్రాండ్ లో నియోజకవర్గ ఇంచార్జ్ ఎస్ అల్లా బకాష్ సిఎల్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్య అతిధులుగా ఏపిసిసి అధ్యక్షులతో పాటు ఎఐసిసి మొయ్యప్పన్,వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్,రాష్ట్ర మీడియా చైర్మెన్ నర్రెడ్డి తులసి రడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సైనికుడిలా పనిచేయాలని ఆయన సూచించారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని అమరావతి సమీపంలో బాలికపై అత్యాచారం జరిగితే ప్రభుత్వంలోఎటువంటి స్పందన లేదని విమర్శించారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో అభివృద్ధిని పక్కన పెడితే వైన్ మాఫియా షాన్ మాఫియా,లిక్కర్ మాఫియా వంటి రౌడీ రాజకీయాలే ఎక్కువయ్యాయన్నారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వేలాది మందికి ఉపాధి చూపించి నప్పుడే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందన్నారు.రాష్ట్రంలో బి అంటే బాబు జె అంటే జగన్ పి అంటే పవన్ అని బిజెపిలో ఐక్యమయ్యాయని అభివృద్ధి మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు.రాష్ట్రాన్ని నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించారని,అయినా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే ఉందన్నారు.అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ మీడియా చైర్మన్ తులసిరెడ్డి మాట్లాడుతూ జిల్లా వాసులకు ప్రధానమైన సాగు్నీటి ప్రాజెక్ట్ అయినటువంటి అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్ల మరమ్మత్తులకు కావలసిన డబ్బును ఇవ్వక పోవడంతో ప్రాజెక్ట్ తెగి ముంపు నివాసితులకు చాలా ప్రాణ,ఆస్తినష్టం వాటిల్లిందన్నారు.ఇది జరిగి సుమారు రెండు సంవత్సరాల కాలం గడుస్తున్న నేటికీ బాధితులను పట్టించుకోని ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం అని విమర్శించారు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు.ఈ కార్యక్రమంలో అన్నమయ్యయ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.