ఫ్యాప్టో కార్యాచరణ విజయవంతం చేయండి
1 min readపల్లెవెలుగు:ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పై ఫ్యాప్టో ఉద్యమ కార్యాచరణ చేపట్టిందని అందులో భాగంగా జూన్ 25 వ తేది ఉదయం 9 గంటలకు కర్నూలు జిల్లా పరిషత్ మీటింగ్ హల్ యందు కర్నూలు ఉమ్మడి జిల్లా విద్యా సదస్సు ఏర్పాటు చేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఫ్యాప్టో) రాష్ర్ట కో చైర్మన్ ప్రకాష్ రావు తెలిపారు. శనివారం జెడ్పీ ఉన్నత పాఠశాల వసంత నగర్లో కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రకాష్ రావు మాట్లడుతూ అధికారం లోకి వచ్చిన వారం లోగా సి పి ఎస్ రద్దు చేస్తాం అని చెప్పి నాలుగు సంవత్సర కాలం పూర్తి అయిన తరువాత జి పి ఎస్ ను బలవంతాన రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యాప్టో ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి అంగీకరించదు. ఇచ్చిన మాట ప్రకారం ఓ పి యస్ ను అమలు లోకి తెవలసిందే. గతంలో పి అర్ సి సమయంలో ఉద్యమాన్ని ప్రారంభించిన ఫ్యాప్టో ఉద్యమ పగ్గాలు జె ఏ సి లకు అప్పగించింది. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థతుల్లోనైనా ఉద్యమ కార్యాచరణ ను ఫ్యాప్టో అమలు చేస్తుంది. కలసి వచ్చే ఏ ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘం ను అయిన కలుపుకొని ముందుకు వెళుతుంది. ఫ్యాప్తో పై రాష్ట్రం లో ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల కు నమ్మకం వుంది,ఆ నమ్మకం ను ఫ్యాప్టో నిలబెట్టుకుంటూ ముందుకు వెళుతుంది. కావున 25 వ తేది జరగబోయే విద్యా సదస్సు కు కర్నూలు మరియు నంద్యాల జిల్లా ల నుండి పెద్ద ఎత్తున ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ మిత్రులు హాజరు అయి మన శక్తి ని మరియు మనలో ఐక్యతను ప్రభుత్వం నకు చూపవలసిన అవసరం వుంది అన్నారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమార్, రాష్ర్ట ఎస్ సి ఎస్ టి ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సుబ్బరాయుడు,ప్రసాద్, వెంకట రమణ గుప్త, మస్తాన్ వలీ, శ్రీనాథ్, దత్తాత్రేయ, రాజ్య లక్ష్మి, లత మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.