నాలుగో ఏడాది… ‘అమ్మ ఒడి’ జమ
1 min readపల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో:పిల్లల చదువులకు పేదరికం అడ్డు రాకూడదని , సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకాన్ని వరుసగా నాలుగో ఏడాది (2022–23 విద్యా సంవత్సరానికి) అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న 83,15,341మంది విద్యార్ధులకు అమ్మ ఒడితో లబ్ధి చేకూరుస్తూ 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లను బుధవారం పార్వతిపురం, మన్నెం జిల్లా, కురుపాలెంలో కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. రాయచోటి కలెక్టరేట్ లోని స్పందన హాల్లో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన తల్లులకు ఒక్కొక్కరికి రూ.15,000 వేలు చొప్పున 1,52,366 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో రూ.225.55 కోట్ల రూపాయల మొత్తాన్ని నేరుగా జమ చేయు ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, మునిసిపల్ ఛైర్మన్ ఫయాజ్ భాష, డీఈఓ పురుషోత్తం, డిప్యూటీ డిఈఓ వరలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తల్లులు తదితరులు పాల్గొన్నారు