‘లా నేస్తం’పై..హర్షం
1 min readఐ .ఏ .ఎల్ . రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. సురేంద్ర కుమార్
పల్లెవెలుగు, పత్తికొండ: రాష్ట్రంలో యువ న్యాయవాదుల కోసం స్టైఫండ్ నిమిత్తం నెలకు రూ.5వేలు చొప్పున ఫిబ్రవరి నుండి జూన్ వరకు రావలసిన ఆరు కోట్ల 12 లక్షల రూపాయలు సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నిధులు మంజూరు చేయటం పట్ల ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్( ఐ.ఏ.ఎల్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. సురేంద్ర కుమార్ గురువారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువ న్యాయవాదులకు వారి స్థితిగతులను అర్థం చేసుకొని నెల, నెల ‘లా’ నేస్తం నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది న్యాయవాదులు మరణించగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో న్యాయవాదికి 4 లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ నిధులు 30 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయని ,వాటిని కూడా వెంటనే నిధులు విడుదల చేసి, బాధిత న్యాయవాది కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో న్యాయవాదుల పై జరుగుతున్న దాడులను అధికం అరికట్టేందుకు న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.