NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హాస్టల్​ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి

1 min read

హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ డి.రమేష్​

పల్లెవెలుగు, ఏలూరు:  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేష్  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని గురుకులం, ఎస్సీ హాస్టల్స్ ను, శనివారం పేటలోని బాలురు వసతి గృహాన్ని ఆకిస్మిక తనిఖీ చేశారు. శనివార పేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. వసతి గృహంలోని విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు పైన ఆయన పరిశీలించారు . వసతి గృహంలోని తరగతి గదులను,  వంటశాలను, పరిసరాల పరిశుభ్రతను, స్నానాలు గదులను పరిశీలించి , పరిశుభ్రత పై  అధికారులకు తగు సూచనలు చేశారు. తదనంతరం జిల్లా కోర్టు ప్రాంగణములో చిల్డ్రన్ సూపరింటెండెంట్,  సిడబ్ల్యుసి సభ్యులతో ను, విద్యాశాఖ అధికారులతోనూ మరియు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.  అనంతరం  వట్లూరు, పొలసానిపల్లి, ద్వారకాతిరుమల, కొవ్వూరు దగ్గరలోని కుమారదేవం గ్రామాల్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలను పరిశీలించారు.  వసతి గృహాలలోని ఆహార పదార్థాలు నిలువచేసే స్టోర్ రూములను, వంటశాలలను, స్నానపు గదులను విద్యార్థుల వసతి గదులను తరగతి గదులను  పరిశీలించారు. అలాగే ఉపాధ్యాయ వివరాలు, భద్రతా సిబ్బంది వివరాలు త్రాగునీటి సౌకర్యాల పైన ఫిర్యాదుల బాక్సుల సౌకర్యము,  తల్లిదండ్రులతో మాట్లాడే సౌకర్యాలపైన, వైద్య సదుపాయాల పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులతో నేరుగా వారి సమస్యలను, వారి పొందుతున్నా సౌకర్యాల పైన ఆరా తీశారు. అలాగే దేవరపల్లి మండలంలోని చిన్నాయగూడెం లోని సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని కూడా సందర్శించి అక్కడ బాలికలకు ఉన్నటువంటి భద్రత మరియు సౌకర్యాల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్, పోక్సో కోర్టు జడ్జ్  ఎస్ ఉమా సునంద, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  జి రాజేశ్వరి, జ్యువనైల్ జస్టిస్ బోర్డ్ మెంబర్స్, సి డబ్ల్యూ సి మెంబర్, జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

About Author