కర్నూలుకు పరిశ్రమలు తీసుకొస్తా..: టి.జి భరత్
1 min read–శాకాంబరి అమ్మవారిని దర్శించుకున్న టీజీ భరత్
పల్లెవెలుగు:పారిశ్రామికవేత్తగా తనకున్న అనుభవంతో కర్నూలుకు పరిశ్రమలు తీసుకొస్తానని టీడీపీ కర్నూలు ఇన్చార్జ్ టిజి భరత్ అన్నారు. నగరంలోని పూలబజార్ లో ఉన్న చిన్న అమ్మవారిశాలలో నిర్వహించిన శాకాంబరి అలంకారం ఉత్సవంలో ఆయన పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాకాంబరి ఉత్సవం వైభవంగా నిర్వహించారని చెబుతూ ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనుక నిర్వాహకుల శ్రమ ఎంతో ఉంటుందన్నారు. భక్తులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో తన తండ్రి టిజి వెంకటేష్ కు ఎంతో మంచి పేరుందని, ఆయనలాగే మంచి పేరు తెచ్చుకునేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఒక్క పరిశ్రమ కియాతో అనంతపురం రూపురేఖలు మారిపోయాయని.. ఇక తనకున్న అనుభవంతో కర్నూలుకు పరిశ్రమలు తీసుకొస్తానన్న సత్తా ఉందన్నారు. స్థానికంగా పరిశ్రమలు వస్తే ఇక్కడి యువత హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలాంటి ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకోవచ్చని చెప్పారు. ఇక అందరూ ఓట్లు తప్పకుండా చెక్ చేసుకోవాలని, ఎందుకంటే మొన్న ఉన్న ఓటు నేడు తొలగిపోయే ప్రమాదం ఉందని.. ప్రతి ఒక్కరూ ఆధార్ కు ఓటును లింక్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూటూరు గోపాలయ్య, నందకిషోర్, శేషగిరిశెట్టి, నాగరాజు, టిడిపి నేత శ్రీధర్, కార్యవర్గ సబ్యులు, భక్తులు పాల్గొన్నారు.