PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మన్యం వీరుడు అల్లూరికి..ఘననివాళి

1 min read

టిడిపి మండల అధ్యక్షులు బానుగోపాల్ రాజు

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో::తెలుగుజాతి పౌరుష ప్రతాపాలను ప్రపంచానికి చాటిన చెప్పిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని తెలుగుదేశం పార్టీ వీరబల్లి మండల అధ్యక్షులు ఎం భానుగోపాల్ రాజు కొనియాడారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మంగళవారం అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పాలాభిషేకం ,పూలాభిషేకంతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరతమాత దాస్య శ్రృంకలాలను తెంచడానికి బ్రిటిష్ సామ్రాజ్యంపై మూడేళ్లు పాటు ప్రత్యక్ష సాయుధ పోరాటం సాగించారన్నారు చివరకు బ్రిటిష్ తుపాకుల తూటలకు నేలకొరిగారని చెప్పారు తెలుగు తల్లి ముద్దుబిడ్డ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు నిరంతరం తన పోరాటాన్ని సాగించారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు గారు 2014 సంవత్సరం నుంచి అల్లూరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపడానికి నిర్ణయించిందన్నారు . అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అల్లూరి సీతారామరాజు గారి ఉత్సవాలను నిర్వహించేందుకు సరైన చర్యలు తీసుకోలేదన్నారు. ఏ గిరిజనుల కోసమైతే సీతారామరాజు పోరాడారో ఆ ఆశయాలు నేటికీ పరిపూర్ణంగా నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో గిరిజనులు గిరిజన ప్రాంతాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో  గిరిజనుల అభివృద్ధి కి ఎటువంటి చర్యలు చేపట్టలేదు అన్నారు. ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామ్మోహన్ రెడ్డి ,నాగ సుబ్బయ్య నాయుడు, జయచంద్ర రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు ఆంజనేయ రెడ్డి, ప్రభాకర్ నాయుడు రాజరాజు  బాస్కర్ రాజు, మహిళా కమిటీ  అధ్యక్షురాలు నాగసుబ్బమ్మ ,వెంకటరామరాజు, లక్ష్మిరెడ్డి, సీతారామరాజు, బాలరాజు , గంగయ్య నాయుడు, తుమ్మల రమేష్ ,జయిడు, సుబ్బరామ ,సుబ్బయ్య, వెంకటరమణ, వి.ఆంజనేయులు వీరామృత నాయుడు, భాస్కర్, వినయ్, రామకృష్ణ, హరి, చంద్ర, యర్రయ్య, నరసింహులు దితరులు పాల్గొన్నారు.

About Author