ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే..
1 min readపల్లెవెలుగు, మహానంది: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే.. ఈ పథకాలు మీకు అందుతాయా అని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్థానికులను ప్రశ్నించారు. మహానంది మండలంలోని తమడపల్లె గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నాళ్ళోనే అనేక ఆర్థిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి కుటుంబానికి ఆర్థికంగా, విద్యాపరంగా మేలు జరుగుతుందని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవడానికి జగనన్న ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన, అమ్మ ఒడి ఇతర పథకాల ద్వారా నగదు బదిలీ పారదర్శకంగా విద్యార్థినీ విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేస్తుందని గుర్తు చేశారు. వీటితోపాటు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు మరియు పొదుపు సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకుగాను జగనన్న సురక్ష పథకంలో భాగంగా ఎన్నో రకాల సర్టిఫికెట్లు అప్పటికప్పుడు అక్కడికక్కడే మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల తో పాటు రైతులకు వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న సహాయ సహకారాలు ఏ ప్రభుత్వమైనా చేస్తుందా అని అన్నారు. ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మరియు రైతులు ఆలోచించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం అందజేస్తున్న అనేక సంక్షేమ ఆర్థిక పథకాలు అందాలంటే తిరిగి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అందుతాయని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి తాసిల్దార్ జనార్ధన్ శెట్టి డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసులు ఎంఈఓ రామసుబ్బయ్య ఇన్చార్జి ఎంపీడీవో నాగ శివ జ్యోతి మహానంది దేవస్థానం చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గాజులపల్లె మధుసూదన్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.