జగనన్న సురక్ష.. పేదలకు రక్ష..
1 min readమాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి
పల్లెవెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న సురక్ష.. పాలన వ్యవస్థలో నూతన విప్లవం తీసుకొచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి. నగరంలోని 12వ వార్డు 29వ సచివాలయంలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న సురక్ష…పేదలకు రక్ష అని, ఈ కార్యక్రమంతో ప్రతి కుటుంబానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. అనంతరం వివిధ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో 12వ వార్డు కార్పొరేటర్ క్రాంతి కుమార్, రాజ్, షరీఫ్, శేఖర్, బాష, సత్యరాజ్, వనేష్, ఎం. శేఖర్ తదితరులు పాల్గొన్నారు.