PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న సురక్షతో.. పేదలకు మేలు

1 min read

వైసీపీ యువ నాయకుడు ప్రదీప్​ రెడ్డి

పల్లెవెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం పేదలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు వైసీపీ యువ నాయకుడు వై.ప్రదీప్​ రెడ్డి. గురువారం కౌతాళం మండలం చూడి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం  సర్పంచ్​ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రదీప్ రెడ్డి మాట్లాడారు.ఈ సందర్భంగా 11 ప్రభుత్వ సేవలకు ప్రజల నుంచి 400 టోకెన్లు నమోదు చేసుకొని వాటిని సర్వీస్ రిక్వెస్ట్లుగా కన్వేర్ట్ గా కస్టమర్లు చేశారు..కార్యక్రమం అనంతరం 400 మందికి లబ్ధిదారులకు ఆదాయపు మరియు కుల ధ్రువీకరణ పత్రాలను ప్రజాప్రతినిధులు చేతుల మీదగా అందజేశారు.  జగనన్న సురక్ష ద్వారా అర్హులైన లబ్దదారులకు అర్జీలు సమర్పించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అమ్రేష్, మండల కో-ఆప్షన్ సభ్యులు మాబు సాహెబ్, వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి, చౌదరి బసవరాజ్, ఎంపీడీవో సుబ్బరాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, వీఆర్వో నాగేంద్రప్ప, వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author